iDreamPost
android-app
ios-app

పిల్లలతో ఈ పరీక్ష రాయించండి.. రూ. 2.5 లక్షల స్కాలర్ షిప్ పొందండి

పిల్లలతో ఈ పరీక్ష రాయించండి.. రూ. 2.5 లక్షల స్కాలర్ షిప్ పొందండి

చదువుకోవాలన్న అభిలాష ఉండి.. ఆర్థిక స్థోమత సహకరించక.. అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు మధ్యలోనే చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు బడి చదువుల వరకే పరిమితమౌతున్నారు. 10, 12 వ తరగతితోనే చదువు ఆపేసి.. పనులకు వెళుతున్నవారెందరో. ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉన్నా కుటుంబ స్థితి గతులు, ఆర్థిక పరిస్థితులను తలొగ్గి పని బాట పడుతున్నారు. అటువంటి వారికి ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అదే యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం ఫర్ వైబ్రాంత్ ఇండియా. షార్ట్ కట్‌లో పీఎం యశస్వీ స్కీం. ఈ స్కాలర్ షిప్ కింద పేద విద్యార్థులు రూ. 2.5 లక్షల స్కాలర్ షిప్ పొందవచ్చు. దీనికి ఓ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంతకు ఎవరెవరూ ఈ పరీక్షకు అర్హులో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

నిరుపేద, అణగారిన కుటుంబాల పిల్లలకు విద్యను అందించాలన్న లక్ష్యంగా పీఎం యశస్వీ పథకాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఉపకార వేతనానికి తొమ్మిది నుండి ఇంటర్ చదువుతున్న చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రెండున్నర లక్షల కంటే తక్కువగా ఉండాలి. స్కాలర్ షిప్ పొందేందుకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షను రాయాల్సి ఉంటుంది.  పరీక్ష ఎప్పుడు ఉంటుందో వివరాలు తెలుసుకుందాం. ఈ ఏడాది అర్హులైన అభ్యర్థుల నుండి ఆగస్టులోనే దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబర్ 29న దేశ వ్యాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంగనర్.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, అమరావతి, నెల్లూరు, విశాఖ పట్నం లాంటి నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీషు లేదా హిందీ భాషల్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. మూడు గంటల పాటు జరిగే ఈ పరీక్షలో మొత్తం 400 మార్కులు ఉంటాయి. గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం, జనరల్ అవేర్ నెస్ పై ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కులు ఉండవు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 9,10వ తరగతులకు గానూ రూ.75 వేలు చొప్పున, 11,12 తరగతులకు గానూ రూ. 1,25,000 చొప్పున ఉపకార వేతనం చెల్లిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉపకారవేతన మొత్తాన్ని ఒకేసారి వారి ఖాతాల్లోకి జమ చేస్తారు.