iDreamPost
android-app
ios-app

ప్రధాని అనుకుంటే సమస్యల పరిష్కారం ఎంత పని అంటున్న ఎంపీ

ప్రధాని అనుకుంటే సమస్యల పరిష్కారం ఎంత పని అంటున్న ఎంపీ

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సైతం సముచిత పాత్ర ఉందన్నారు వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఎంపీ… నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని… కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇందుకు పావుగా ఎంపీ రఘురామకృష్ణం రాజును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఆయనతో ఒక పిటిషన్ పెట్టించారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. గృహ నిర్మాణానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. సహజంగా రాజుల్లో పోరాటపటిమ ఉంటుంది అని… ఈ రాజుగారి విషయంలో మాటలు తప్ప, మరేమీ లేదు అని విమర్శించారు. ఈ మాటల తూటాలతో ప్రజల్లో పలచనైపోవడం తప్ప ఇంకేమీ లేదన్నారు ఆయన. రాజీనామా చేస్తానని చెప్పి, పారిపోయారని ఆయన వ్యాఖ్యలు చేశారు.

రాజులు ఎవరూ ఇలా చేయరు అని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యక్ష సహాయం తీసుకుంటూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ పనులు ఆపాలని ఇటు చంద్రబాబును, అటు రఘురామకృష్ణం రాజును కోరుతున్నాను అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, మనీ సర్క్యులేషన్‌లో ఉంచడమే అని చెప్పుకొచ్చారు. ఇందులో ఎంతమందికి పని కల్పించామన్నదే ముఖ్యం తప్ప, ఎంతపని జరిగిందన్నది ముఖ్యంకాదని వ్యాఖ్యానించారు.

పేదవాడి ఇంటిస్థలాన్ని చదును చేయడానికి ఈ పథకాన్ని ఒప్పుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణం రాజు ఇద్దరూ కలిసి పిటిషన్లు పెట్టి స్టే తీసుకొచ్చారన్నారు. పేదవారిపై వీరికున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్థమవుతుందన్న ఆయన… రూ. 55,580 కోట్లతో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని సీఎం జగన్, ప్రధానిని కలిసినప్పుడు పదే పదే కోరారని గుర్తు చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సహా పలు విభాగాలు ఆమోదించినా సరే, కేంద్రం ఆమోదించకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని ఫైర్ అయ్యారు.

విభజన హామీలను పదేళ్లలో అమలు చేస్తామని చెప్పి, ఇప్పటివరకు కనీసం రెవెన్యూ లోటును సైతం భర్తీ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి, ఎంపీలు ఎన్నిసార్లు అడగాలి? అని ప్రశ్నించిన ఆయన… మేం ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. కానీ రఘురామకృష్ణం రాజు, చంద్రబాబు అడ్డుపుల్ల పిటిషన్లు వేస్తే, తక్షణమే కేంద్రం స్పందిస్తోందని వ్యాఖ్యానించారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇదేనా అని నిలదీశారు.

ఇక కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ… ఏపీ విభజన అశాస్త్రీయమని, కాంగ్రెస్ అన్యాయంగా విడదీసిందని ప్రధాని సభలో అన్నారని ఈ విషయాన్ని గుర్తించినందుకు ప్రధాని మోడీ కి అభినందనలు, ధన్యవాదాలు చెప్పారు. అన్యాయం జరిగింది సరే.. మరి న్యాయం చేయండని కోరారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై కేంద్రాన్ని అడగాలి అని విజ్ఞప్తి చేశారు. అయోధ్య మందిరం, కాశీ కారిడార్, కాశ్మీర్ అంశం పరిష్కరించిన మోడీ కి, ఏపీని అభివృద్ధి చేయాలి అనుకుంటే ఆయనకు ఇదేమీ పెద్ద పని కాదన్నారు.

పోలవరం ప్రాజెక్టు కేవలం ఏపీకి మాత్రమే ఉపయోగపడేది అనుకోవద్దన్న ఎంపీ దేశం మొత్తానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. అక్కడ ఉత్పత్తయ్యే 970 మెగావాట్ల విద్యుత్తు అందరూ వాడుకోవచ్చన్నారు. మాట్లాడితే అప్పులు, అప్పులు అంటున్నారని… గతంలో ఏ ప్రభుత్వమూ అప్పు చేయలేదా? అప్పు లేకుండా ఏ ప్రభుత్వమైనా ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై ప‌ట్టు బిగిస్తున్న ఎంపీలు

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler