SNP
Astrazeneca, Covishield, Vaccine: కోవిషీల్డ్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీకా తయారీ సంస్థ కోర్టులో నిజం ఒప్పుకోవడంతో.. భారతీయుల్లో కొత్త భయం మొదలైంది. గతంలో సంభవించిన గుండెపోటు మరణాలు దాని వల్లేనా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Astrazeneca, Covishield, Vaccine: కోవిషీల్డ్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీకా తయారీ సంస్థ కోర్టులో నిజం ఒప్పుకోవడంతో.. భారతీయుల్లో కొత్త భయం మొదలైంది. గతంలో సంభవించిన గుండెపోటు మరణాలు దాని వల్లేనా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
SNP
2020-21లో కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, బిక్కుబిక్కుమంటూ బతికేలా చేసింది. చాలా మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు, అలాగే కొన్ని కోట్ల మంది జీవనోపాధిని కూడా కోల్పోయారు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరి.. లక్షల్లో డబ్బు ఖర్చయిపోయి.. అప్పులు పాలైన వాళ్లు ఉన్నారు. గతంలో ప్రపంచం ఎప్పుడూ చూడని విపత్కర పరిస్థితుల్లో చీకటిలో వెలుగులా.. టీకాలు ప్రజల ప్రాణాలను నిలిపాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు, కరోనా రాకుండా నియంత్రించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వం తమ ప్రజలకు టీకాలు వేయించాయి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం అందరికీ టీకాలు వేయించింది. వాటిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ప్రధానమైనవి. అయితే.. కరోనా టీకాలు వేయించుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరిగిందని, టీకా కారణంగా గుండె బలహీన పడి, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారనే ప్రచారం జరిగింది.
వాటిపై అధ్యయం చేసిన కొన్ని ఆరోగ్య సంస్థలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోవిషీల్డ్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా బ్రిటన్‌లోని ఓ కోర్టులో తాము తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. కోవిషీల్డ్‌తో తనకు తీవ్ర నష్టం జరిగిందని ఓ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. అతనితో పాటు మరో 51 కేసులు ఆస్ట్రాజెనెకా కంపెనీపై ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా.. కోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో తమ కోవిషీల్డ్‌తో కొన్ని అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రెజెనెకా కంపెనీ నిజం ఒప్పుకుంది. దీంతో.. కోర్టు బాధితులకు న్యాయం చేస్తూ.. ఆస్ట్రెజెనెకా కంపెనీకి జరిమానా విధించి, బాధితులకు నష్ట పరిహారం ఇప్పించే అవకాశం ఉంది.
అయితే.. ఇండియాలో కూడా ఈ కోవిషీల్డ్‌ను విరివిగా వాడిన విషయం తెలిసిందే. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. మన దేశంలో 100లో 70 మందికి ఈ కోవిషీల్డ్ టీకానే వేశారు. కోవాగ్జిన్ కంటే ధర తక్కువ కావడంతో ఈ డోస్‌లను కేంద్ర ప్రభుత్వం ఎక్కువ కొనుగోలు చేసి.. దేశ పౌరులకు ఉచితంగా అందించింది. అయితే.. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత.. చాలా మంది గుండెపోటుతో మరణించారు. అందులోనూ కరోనా టీకా వేయించుకున్న వారిలోనే ఈ మరణాలు ఎక్కువ సంభవించడంతో అంత భయభ్రంతులకు గురయ్యారు. ఇప్పుడు ఏకంగా టీకా తయారు చేసిన కంపెనీనే తమ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కోర్టు ముందు నిజం ఒప్పుకోవడంతో.. ఇండియాలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని పేర్కొనడంతో భయపడుతున్నారు. గతంలో వచ్చినవి కేవలం పుకార్లు కాదని, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే గుండె పోట్లు వచ్చాయని చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి కోవిషీల్డ్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆస్ట్రెజెనెకా కంపెనీ ఒప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The govt had run its advertisement on the vaccine slip. But who will take responsibility for this now, our Primer Minister? This is not a Fake Video! #CovidVaccines #Covishield pic.twitter.com/YF2wrh76wu
— 𝑺𝒉𝒂𝒉𝒃𝒂𝒛 (@shahbazyours) April 30, 2024