iDreamPost
android-app
ios-app

Pawan Kalyan: తొడకొట్టాడో.. తెలుగోడు, హరిహర వీరమల్లు’ నుంచి పవర్‌ గ్లాన్స్‌

  • Published Sep 02, 2022 | 12:34 PM Updated Updated Sep 02, 2022 | 12:34 PM
Pawan Kalyan:  తొడకొట్టాడో.. తెలుగోడు, హరిహర వీరమల్లు’ నుంచి పవర్‌ గ్లాన్స్‌

కొన్ని వారాలుగా నెగిటీవ్ వార్త‌ల్లో న‌లుగుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో. ఎప్పుడు స్టార్ట్ అయ్యిందోకూడా అందరూ మార్చిపోయారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా తెలియ‌డంలేద‌న్న వార్త‌ల మ‌ధ్య‌, పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కొత్త‌ అప్‌డేట్ వ‌చ్చింది. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది.

మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో, తెలుగోడు అన్న‌ పాట నేప‌థ్యంలో పవన్‌ ఫైట్స్ దుమ్ముదులిపాయి. మ‌ల్ల‌యోధుల‌ను ఎత్తికుదేసి, భీక‌రంగా తొడ‌గొట్టిన ప‌వ‌న్ స్టైల్ ఫ్యాన్స్ కి విజిల్స్ వేయించ‌డం ఖాయం.

మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నుక డేట్స్ ఇస్తే, వచ్చే ఏడాది విడుదల కాను8ంది. తెలుగుతో పాటు తమిళం, కన్న‌డం, మలయళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. ఇప్పుడున్న ట్రెండ్ కి త‌గ్గుట్టుగానే సినిమా రానుంద‌న్న‌ది స‌మాచారం.