iDreamPost
android-app
ios-app

Pawan Kalyan: థియేటర్ ల‌పై పవన్‌ అభిమానుల రాళ్లదాడి, విధ్వంసం

  • Published Sep 02, 2022 | 1:56 PM Updated Updated Sep 02, 2022 | 2:06 PM
  • Published Sep 02, 2022 | 1:56 PMUpdated Sep 02, 2022 | 2:06 PM
Pawan Kalyan: థియేటర్ ల‌పై పవన్‌ అభిమానుల రాళ్లదాడి, విధ్వంసం

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కర్నూలులోని శ్రీరామ థియేటర్‌పై దాడికి దిగారు. శుక్రవారం పవన్‌ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ థియేటర్‌లో ‘జల్సా’ సినిమా స్పెషల్‌ షోలు ప్రదర్శించారు. ఇదో పండుగ‌గా , పవన్‌ ఫ్యాన్స్‌ సినిమా చూసేందుకు భారీగా వ‌చ్చారు. పాట‌ల‌కు థియేటర్‌లో సౌండ్‌ సిస్టం సరిగాలేదని ఫ్యాన్స్ గొడ‌వ చేశారు. థియేటర్‌పై రాళ్లు విస‌ర‌డంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక విశాఖలో పవన్ కళ్యాణ్ అభిమానుల బీభత్సంచేశారు. లీలా మహల్ థియేటర్లో ఫ‌స్ట్ షో, సెకండ్ షో జల్సా సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించారు. బీర్ బాటిల్స్ పగలగొట్టి స్క్రీన్ చించేశారు. డాన్స్ లు, అరుపుల‌తో సీట్లు ధ్వంచేశారు. సీలింగ్ కూడా డామేజ్ అయ్యింది. థియేట‌ర్ నిండా పేప‌ర్లు, గాజుముక్క‌లే. మొత్తం మీద ప‌వ‌న్ స్పెష‌ల్ షోను వేసినందుకు థియేట‌ర్ కు సుమారు 20 లక్షలు నష్టం వ‌చ్చింద‌ని సిబ్బంది చెబుతున్నారు.

పవన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీ ప్రముఖులు, నెటిజన్ల శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం పవన్‌ ‘హరిహరి వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప‌వ‌ర్ గ్లాన్స్ కూడా విడుద‌లైంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş