iDreamPost
android-app
ios-app

వీడియో: ట్రైన్ లో ఘరానా మోసం! రూ. 350కే పవర్ బ్యాంక్ అంటూ! ఓపెన్ చేసి చూడగా!

  • Published Jun 20, 2024 | 6:23 PM Updated Updated Jun 20, 2024 | 6:23 PM

సాధారణంగా రైళ్లలో కొంతమంది ఇయర్ ఫోన్స్, సెల్ కవర్స్, మొబైల్ ఛార్జింగ్ వంటివి విక్రయిస్తుంటరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు రైలులో మొబైల్ పవర్ బ్యాంకును కొనుగోలు చేశాడు. తీర దానిలో బ్యాటరీ బదులు మట్టి ముద్ద ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సాధారణంగా రైళ్లలో కొంతమంది ఇయర్ ఫోన్స్, సెల్ కవర్స్, మొబైల్ ఛార్జింగ్ వంటివి విక్రయిస్తుంటరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు రైలులో మొబైల్ పవర్ బ్యాంకును కొనుగోలు చేశాడు. తీర దానిలో బ్యాటరీ బదులు మట్టి ముద్ద ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Published Jun 20, 2024 | 6:23 PMUpdated Jun 20, 2024 | 6:23 PM
వీడియో: ట్రైన్ లో ఘరానా మోసం! రూ. 350కే పవర్ బ్యాంక్ అంటూ! ఓపెన్ చేసి చూడగా!

ప్రస్తుత కాలంలో మార్కెట్ లో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్న ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఈరోజుల్లో ఏ వస్తవు కూడా నాణ్యమైనది కావడం లేదు.ముఖ్యంగా తాగే నీరు,పాలు , ఆహార ఉత్పత్తులు దగ్గర నుంచి వాడే ఎలక్ట్రికల్ వస్తువులు వరకు ప్రతిది కల్తీ అవుతున్నాయి. ఎక్కడ కూడా నాణ్యమై వస్తువుల దొరకడం లేదు. అంతా కల్తీ రాయిల ఆరాచకలే అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా.. బ్రాండెడ్ పేర్లతో విక్రయిస్తున్న వస్తువులు కూడా పైన పటారం.. లోన లొటారంలా ఉంటుంది వ్యవహారం.అధిక డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో.. అడ్డదారుల్లో ప్రతిదీ మోసంకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి మోసన్నే ఓ ప్రయాణికుడు రైలులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

సాధారణంగా రైళ్లలో కొంతమంది ఇయర్ ఫోన్స్, సెల్ కవర్స్, మొబైల్ ఛార్జింగ్ వంటివి విక్రయిస్తుంటరనే విషయం తెలిసిందే. అయితే దూరర ప్రయాణాలు చేసే కొంతమంది వెంటే పవర్ బ్యాంకు ఛార్జర్ ఉంటే చాలా బాగుంటదని వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే బయట మార్కెట్ లో దొరికే పవర్ బ్యాంకులు రూ.1,000-2,000 ఖరీదు ఉంటాయి. ఇక వాటిని రైళ్లలో రూ.400 నుంచి రూ.500 మధ్యలో విక్రయిస్తుంటారు. ఇక ప్రయాణికులు కూడా ఇంత చౌకగా ఎలా దొరుకుతుందని ఆలోచన చేయకుండా.. వెంటనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రయాణికుడు సుదూర రైలులో ప్రయాణిస్తూ నకిలీ పవర్ బ్యాంక్‌ స్కామ్ 2024 అంటూ బయట పెట్టాడు. కాగా, అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఆ వీడియోలో ఓ వ్యక్తి వివిధ మొబైల్ కంపెనీల పవర్ బ్యాంక్‌లను చూపుతున్నట్లు కనిపిస్తుంది. కాగా, వాటన్నింటి ధర కేవలం రూ. 500 నుంచి 550 రూపాయల వరకు ఉంటుందని పైగా వాటికి ఒక సంవత్సరం గ్యారెంటీ కూడా లభిస్తుందని విక్రేత చెబుతుండటం గమనార్హం. ఒక వేళ అది కిందపడిపోయి ఏదైనా డ్యామెజ్‌అయితే దానికి ఎలాంటి వారంటీ ఉండదని కూడా చెబుతుంటాడు. అయితే రైలులు ఇలా పవర్‌ బ్యాంకులను అమ్ముతూ ప్రయాణికులతో బేరం అడుతుంటారు. బేరం కుదుర్చుకున్న ప్రయాణికుడు తుది ధరను చెప్పమని అడగగా, చివరకు ఆ ఎలక్ట్రానిక్‌ వస్తువుల అమ్మే యువకుడు రూ.350 అని ధరను కుదుర్చుకున్నాడు. సదరు వ్యక్తి పవర్ బ్యాంక్ తీసుకుని ఓపెన్ చేశాడు.

దీంతో అందులో ఉన్నది 10,000, 20,000 mAh బ్యాటరీ బ్యాటరీ కాదు.. అది మట్టి ముద్దతో ఉందని తేలింది. ఇది చూసిన అమ్మే వ్యక్తి వెంటనే సదరు వ్యక్తి చేతిలోని పవర్ బ్యాంక్‌ను లాక్కున్నాడు. అతను పవర్ బ్యాంక్‌ను ఎందుకు పగలగొట్టావని గొడవకు దిగాడు. చివరకు అమ్మేవాడు ఆ ప్రయాణికుడిని కొట్టేందుకు ప్రయత్నించాడు.  కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  కనుక మీరు ఎప్ుడైనా రైళ్లులో ప్రయాణించేటప్పుడు ఇటువంటి ఎలక్ట్రానిక్‌ వస్తువు అమ్ముతుంటే జాగ్రత్తగా ఉండండి. తక్కువ ధరకే వస్తుంది కదా అని తొందరపడితే మోసపోతారు. మరి, రైలులో ఫేక్ పవర్ బ్యాంకులను విక్రయించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.