ఇటీవల కొన్ని రోజుల నుంచి వానలు కురుస్తున్నాయి. ఈ వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తిన్నాలని చాలా మంది భావిస్తుంటారు. ఈక్రమంలో సహజంగా ఎగ్ బజ్జీ, మిరపకాయ బజ్జీలు వంటివి తినేందుకు జనాలు ఆసక్తి చూపుతారు. అయితే వేడి వేడిగా ఉన్నాయని గుడ్డుతో తయారు చేసే పదార్ధాలు లాగించేస్తుంటారు. అయితే ఇలా ఎగ్ తో చేసిన పదార్థాలను తినేవారికి కోసం ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏమిటంటే ఓ ఎగ్ లో పురుగులు ఉన్నట్లు తెలిసింది. మరి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం మార్కెట్ లో దొరికే కూరగాయలు, పండ్లల్లో తరచూ పురుగులు కనపడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కూరగాయాలను ఇంటికి తెచ్చి కట్ చేసేటప్పుడు పురుగులు బయట పడుతుంటాయి. పురుగులు ఉన్న ఆ భాగాన్ని పక్కన పడేసి మంచిగా ఉన్నదానిని వాడుకుంటాం. అలానే నేటి బిజీ లైఫ్ లో తొందరగా తయారయ్యే కూరల్లో ఎగ్ ఒకటి. చాలా మంది దీనిని ఉడికించుకొని తింటుంటారు. అయితే ఈ ఎగ్ విషయంలో ఓ జంట ఓ వింత అనుభవాన్ని చెబుతున్నారు. ఉడికిన కోడిగుడ్డులో పురుగులు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రసుత్తం కోడు గుడ్డులో బ్యాక్టీయయా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆవీడియో చూసినట్లు అయితే ఉడకబెట్టిన గుడ్డులో పురుగు ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. దారం ఆకారంలో పొడవుగా ఉన్న పురుగు అందులో కనిపించింది. ఇలాంటి పురుగులు ఉన్న ఎగ్స్ తింటే.. అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ పురుగులు ఉన్న ఎగ్స్ తింటే.. అవి మన శరీరంలోకి వెళ్లి గుడ్లు పెడుతాయంట. దీంతో పరాన్నజీవులకు నిలయంగా మారి అనేక వ్యాధులు వస్తాయి. ఇలా దీనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియో వైరల్ అవుతోంది. అలానే ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
చాలామంది బాయిల్ చేసిన తరువాత ఎగ్ లోని కీటకాలు చనిపోయాయని రాశారు. నేటి ప్రపంచంలో ఎక్కువగా నకిలీ వస్తువులే కనిపిస్తున్నాయి. ఇలాంటి నకిలీ ప్రపంచంలో ఫేక్ ఎగ్స్ దొరుకుతున్నాయని మరికొందరు కామెంట్ చేశారు. గుడ్లను ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారంటూ.. దాని లోపల థ్రెడ్ వదిలేయాలని కామెంట్స్ వస్తున్నాయి. అలానే గుడ్లు ఉడకబెట్టిన తర్వాత, దాని తొక్కలు తీసి చూడగా, తెల్లటి రంగు పురుగు కనపడుతుంది. కాబట్టి తినే వస్తువుల విషయంలో కాస్తా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: రన్నింగ్‌లో ఉండగా రెండు ముక్కలైన కొత్త బైకు!