iDreamPost
android-app
ios-app

OTT Series: కోటీశ్వరులపై పగ.. ఒక్క అమ్మాయి ఒక సామ్రాజ్యాన్నే వణికిస్తుంది!

OTT Suggestions- Best Revenge Crime Drama: వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే మీకోసం ఒక బెస్ట్ క్రైమ్ డ్రామా తీసుకొచ్చాం. ఇందులో ఒక్కో ఎపిసోడ్, ఒక్కో సీన్ కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఒక్క అమ్మాయి ఒక సామ్రాజ్యాన్నే కుదిపేస్తుంది.

OTT Suggestions- Best Revenge Crime Drama: వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే మీకోసం ఒక బెస్ట్ క్రైమ్ డ్రామా తీసుకొచ్చాం. ఇందులో ఒక్కో ఎపిసోడ్, ఒక్కో సీన్ కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఒక్క అమ్మాయి ఒక సామ్రాజ్యాన్నే కుదిపేస్తుంది.

OTT Series: కోటీశ్వరులపై పగ.. ఒక్క అమ్మాయి ఒక సామ్రాజ్యాన్నే వణికిస్తుంది!

ఓటీటీలో మీరు ఇప్పటి వరకు ఎన్ని వెబ్ సిరీస్లు చూశారు? ఎలాంటి జానర్స్ చూశారు? ఇవన్నీ మర్చిపోండి. కానీ, మీకోసం ఒక క్రేజీ వెబ్ సిరీస్ ని తీసుకొచ్చాం. ఈ సిరీస్ చూస్తే మీకు అసలు పగలు, ప్రతీకారాలు, హత్యలు అంటే ఇలా ఉంటాయా? అనే అనుమానాలు, భయాలు ఏర్పడతాయి. అంటే కోట్లు సంపాదించడం ఈజీ కావచ్చేమో.. కానీ, ఒక సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి. అలాంటి ఒక కష్టం ఒక బిలియనీర్ కుటుంబానికి వస్తుంది. వారి కుటుంబం మీద పగతో ఒక్క అమ్మాయి.. ఒకే ఒక్క అమ్మాయి వారి మొత్తాన్ని ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి ఒక క్రేజీ సిరీస్ మీకోసం తీసుకొచ్చాం.

ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ నుంచి వచ్చింది. మీరు వెబ్ సిరీస్లు అంటే హాలీవుడ్ అనుకుంటారు. కానీ, బాలీవుడ్ నుంచి కూడా ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్లు వచ్చాయి. వాటిలో ఈ సిరీస్ కూడా ఒకటి. ఈ సిరీస్ మొత్తం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక కోటీశ్వరుల కుటుంబాన్ని టార్గెట్ చేసి వారికి నిద్రపట్టకుండా చేస్తుంది. కుటుంబంలో ఒక్కొక్కరిని వేటాడుతూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది ఎవరికీ అర్థం కాదు. ఒక అమ్మాయి తమ జీవితాల్లోకి వచ్చిన తర్వాతే ఇదంతా జరుగుతోంది అని వారందరికీ తెలుసు. కానీ, ఆమెను దోషిని చేసే ఆధారాలు ఉండవు. పైగా ఆ యువతి ప్రేమ పేరుతో ఆ కుటుంబంలో జొరబడుతుంది.

Karma Calling

తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సిరీస్ మొత్తం కన్నుకు కన్ను.. రక్తానికి రక్తం అనే ఫార్ములా మీద నడుస్తూ ఉంటుంది. అంతా ఒక ఆడది ఏం చేస్తుంది అనుకుంటారు. కానీ, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని గడగడ లాడిస్తుంది. కోట్లకు పడగలు ఎత్తిన వారిని కంగారు పెట్టేస్తుంది. ప్రేమ ముసుగులో తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పెద్ద స్కెచ్చే వేస్తుంది. ఇది వెబ్ సిరీస్ కాబట్టి.. కథను బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. పైగా అందం ముసుగులో పగ తీర్చుకోవడం కాస్త ఆసక్తిగా ఉంటుంది. ఒక్కో ప్లాన్ అమలు చేస్తూ ఆమె చేసే పనులకు ఆడియన్స్ కూడా పిచ్చోళ్లు అయిపోతారు.

ఈ సిరీస్ పేరు కర్మా కాలింగ్. ఇది జనవరి 26, 2024లో విడుదలైంది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మొదటి సీజన్.. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల వరకు ఉంటుంది. యాక్టర్స్ కూడా వారి పర్ఫార్మెన్స్ మెస్మరైజ్ చేశారు. ఇన్టెన్స్ సీన్స్ లో ఒక్కొక్కరి యాక్టింగ్ మెప్పిస్తుంది. ముఖ్యంగా రవీనా టాండన్ సింగిల్ హ్యాండ్ తో ఈ సిరీస్ ని ముందుకు తీసుకెళ్తుంది. మొత్తాని ఈ సిరీస్ చూసిన తర్వాత ఒక బెస్ట్ రివేంజ్ క్రైమ్ డ్రామా చూశారనే భావన కలుగుతుంది. మరి.. మీరు ఇప్పటికే ఈ కర్నా కాలింగ్ సిరీస్ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet