OTT Suggestions- Best Crime Thriller Jamtara: చిన్న ఊర్లో ఉండి దేశాన్నే దోచేస్తారు.. OTTలో రియల్ లైఫ్ వెబ్ సిరీస్!

చిన్న ఊర్లో ఉండి దేశాన్నే దోచేస్తారు.. OTTలో రియల్ లైఫ్ వెబ్ సిరీస్!

OTT Suggestions- Best Crime Thriller Jamtara: ఓటీటీలో మీరు చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఈ సిరీస్ మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఒక్కో సీన్ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. రియల్ లైఫ్ లో జరిగే మోసాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.

OTT Suggestions- Best Crime Thriller Jamtara: ఓటీటీలో మీరు చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఈ సిరీస్ మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఒక్కో సీన్ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. రియల్ లైఫ్ లో జరిగే మోసాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.

మీరు రియల్ లైఫ్ లో కొన్ని క్రైమ్స్ గురించి వినే ఉంటారు. వాటిలో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్. అంటే మీకు ఫోన్ చేసి మీకు తెలియకుండానే మీ ఖాతాను ఖాళీ చేస్తారు. మీకు మాయ మాటలు చెప్పి మీ బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇలాంటి సంఘటనల ఆధారంగా ఒక వెబ్ సిరీస్ ని తీసుకొచ్చారు. ఆ వెబ్ సిరీస్ చూస్తే మీకు బుర్ర గిర్రున తిరుగుతుంది. ఎందుకంటే అందులో చూపించే విషయాలు మిమ్మల్ని ఔరా అనేలా చేస్తాయి. అసలు ఈ క్రైమ్స్ అన్నీ ఎలా జరుగుతాయి? చేసేవాళ్లు ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? మోసం చేసిన ఆ సొమ్ముని ఏం చేస్తారు? ఇలాంటి పాయింట్స్ మీద కథ ముందుకు వెళ్తుంది.

భారతదేశంలో ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలను ఇలా ఫిష్షింగ్ స్కామ్ ల ద్వారా నేరగాళ్లు కొల్లగొట్టారు. అసలు వాళ్లు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు? వాళ్లు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? వాళ్ల పేర్లు ఏంటి? అనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ, ఫోన్ చేసి ఎంతో నమ్మశక్యంగా మీతో మాట కలుపుతారు. మీ కార్డు ఎక్స్ పైరీ అవుతోందని గానీ.. మీకు లాటరీ తగిలిందని గానీ చెప్తారు. వారి మాటలు నమ్మారు అంటే మీ ఖాతాని ఖాళీ చేస్తారు. ఇలాంటి ఫిష్షింగ్ స్కామ్స్ ఇప్పుడు కాస్త తగ్గాయి. ఎందుకంటే ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉంటున్నారు. కానీ, గంతలో జరిగిన ఇలాంటి మోసాలపై ఒక వెబ్ సిరీస్ ఉంది. ఆ సిరీస్ లో ఇలాంటి మోసాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

సాధారణంగా ఇలాంటి స్కామ్స్ ఆఫ్రికా దేశాల్లో జరుగుతాయి అనుకుంటారు. కానీ, ఇండియాలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. ఒక మారుమూల పల్లెటూరిలో కొందరు యువకులు కలిసి ఈ మోసాలు చేస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ చుట్టూ కథను అల్లుకున్నారు. కాస్త రియలిస్టిక్ భావన కోసం నిజ జీవితంలో జరిగిన మోసాలను కల్పిత సంఘటనలుగా పెట్టారు. అలాగే ఈ స్కామ్ లోకి పొలిటికల్ లీడర్లను తీసుకొచ్చారు. ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు ఈ గేమ్ లోకి ఎంటర్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. చిన్న గ్రూపుగా ఏర్పడి చిన్నా చితక మోసాలు చేసే కుర్రాళ్లు ఆ తర్వాత రాజకీయనాయకుడితో కలిసి భారీ కుట్రలు చేస్తారు.

ఏకంగా లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. కానీ, అక్కడి నుంచే వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆఖరికి ప్రాణాలు పోయేంత వరకు వస్తుంది. ఈ కుర్రాళ్లను టార్గెట్ చేసుకుని పోలీసులు కూడా ముమ్మరంగా వెతుకుతూ ఉంటారు. ఒక పోలీసు ఆఫీసర్ వీళ్లని పట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంటాడు. ఇలా వారి జీవితాలు అనుకోని ఊబిలో కూరుకుపోతాయి. అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు? ఈ స్కామ్స్ కంటిన్యూ చేశారా? ఇలాంటి పాయింట్స్ మీద ఈ సిరీస్ నడుస్తూ ఉంటుంది. ఈ సిరీస్ పేరు “జంతారా(Jamtara) “. ఇందులో ఇప్పటికే రెండు సీజన్స్ వచ్చాయి. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments