Swetha
OTT Series Suggestion- Best Suspense Thriller: ఏదైనా సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ మనకు తెలియని భాషలో ఉందంటే.. చాలా మంది లైట్ తీసుకునే వారు. కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు దాదాపు అందరూ అన్ని భాషల సిరీస్ లను, సినిమాలను చూసేస్తున్నారు. మరి మీరు చూసినా లేదా మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.
OTT Series Suggestion- Best Suspense Thriller: ఏదైనా సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ మనకు తెలియని భాషలో ఉందంటే.. చాలా మంది లైట్ తీసుకునే వారు. కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు దాదాపు అందరూ అన్ని భాషల సిరీస్ లను, సినిమాలను చూసేస్తున్నారు. మరి మీరు చూసినా లేదా మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.
Swetha
బాలీవుడ్ , హాలీవుడ్ హర్రర్, థ్రిల్లర్ సినిమాలు , వెబ్ సిరీస్ లు అందరికి బాగానే పరిచయం ఉంటుంది . పైగా వాటిలో చాలా వరకు వెబ్ సిరీస్ లు సినిమాలు బాగానే ఫేమస్ అవుతూ ఉంటాయి. కానీ ఎందుకో బంగ్లాదేశీ భాషలో వచ్చే సినిమాలు మాత్రం కాస్త వెనుకబడిపోయాయి. అంటే ఎందుకో అవి అంతగా ఫేమస్ కావు. కానీ వాటిలో కూడా కొన్ని వెబ్ సిరీస్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పి తీరాలి. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉన్న వారు మాత్రం ఈ వెబ్ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
ఈ సిరీస్ మొత్తం కూడా 8 ఎపిసోడ్స్ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్నీ ముందే గమనించినా కూడా.. చివరి వరకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కడా తగ్గదు. ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. స్టార్టింగ్ లో ఓ అమ్మాయి తనపై జరిగిన రే*ప్ గురించి చెప్తూ ఉంటుంది. దానిని ఒకరు రికార్డు చేస్తూ ఉంటారు. ఇక నెక్ట్ సీన్ కు వస్తే.. తఖ్దీర్ అనే వ్యక్తి ఓ శవాల ఫ్రీజర్ వ్యాన్ కు డ్రైవర్. అతని ఫ్రెండ్ మంటూ చేపల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఓ రోజు తఖ్దీర్ తన ఫ్రెండ్ దగ్గర చేపలను తీసుకుని.. తన ఫ్రీజర్ వ్యాన్ లో వేసుకుని అమ్మడానికి వెళ్తాడు. అప్పుడే అందులో తఖ్దీర్ కు ఓ అమ్మాయి శవం కనిపిస్తుంది. దింతో ఏం చేయాలో తెలియక ఫ్రీజర్ లో శవాన్ని దాచిపెడతాడు. సరిగ్గా అదే సమయంలో ఓ పోలీస్ కమిషనర్ ఇంటి నుంచి.. వేరే డెడ్ బాడీకి ఫ్రీజర్ కావాలని ఆర్డర్ వస్తుంది. దీనితో అక్కడకు వెళ్తాడు తఖ్దీర్. రెండు శవాల్ని ఒకే ఫ్రీజర్ లో ఉంచుతాడు. కానీ పొరపాటున అమ్మాయి శవాన్ని దించడంతో.. పోలీస్ కమిషనర్ కుటుంబం దానికే అంత్య క్రియలు జరిపిస్తారు.
కట్ చేస్తే తఖ్దీర్, మంటూ టీవీలో ఓ న్యూస్ చూస్తారు. రెండు రోజుల నుంచి ఓ న్యూస్ రిపోర్టర్ , కెమెరా మెన్ కనిపించడం లేదని.. దీనితో వ్యాన్ లో దొరికిన శవం ఆ న్యూస్ రిపోర్టర్ దేనని అర్ధమౌతుంది. కెమెరామెన్ ఆ శవాన్ని వెతుక్కుంటూ తఖ్దీర్, మంటూ దగ్గరకే రావడంతో.. వారిద్దరూ ఆ కెమెరామ్యాన్ ను బంధిస్తారు. దీనితో అతను వారికి అసలు విషయం చెప్పేస్తాడు. కొన్ని రోజుల క్రితం ఓ రే*ప్ అయినా అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళమని.. కేవలం అక్కడ జరిగిన ఓ ఫైర్ యాక్సిడెంట్ గురించి కవర్ చేశాం కానీ రే*ప్ గురించి ఎక్కడ టెలికాస్ట్ చేయలేదని.. దీనితో అక్కడ ఏమైందో ఆ అమ్మాయిని కలిసి ఆ వీడియో రికార్డు చేశామని.. ఈలోపే ఆ వీడియో రికార్డింగ్ ను దొంగిలించడానికి ఓ వ్యక్తి రావడంతో.. రిపోర్టర్ ఆ మెమరీ కార్డును మింగేయడంతో.. తానూ కోపంలో ఆమెను షూట్ చేసి ఆ డెడ్ బాడీని తఖ్దీర్ వ్యాన్ లో దాచానంటూ చెప్పుకొస్తాడు.
ఆ మెమరీ కార్డు తనకు చాలా ,ముఖ్యమని చెప్పడంతో.. ఆమె శవాన్ని పాతి పెట్టిన ప్లేస్ లో తవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ ముగ్గురు. ఆ తర్వాత ఏం జరిగింది ! అసలు మెమరీ కార్డును దొంగలించాలనుకున్నది ఎవరు ! ఆ అమ్మాయిని రే*ప్ చేసింది ఎవరు ! వారికి ఆ మెమరీ కార్డు దొరుకుతుందా లేదా ! ఈ విషయం పోలీసులకు తెలుస్తుందా ! ఇవన్నీ తెలియాలంటే.. ‘తఖ్దీర్’ అనే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ హోయ్‌చోయ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.