iDreamPost
android-app
ios-app

భార్యను కష్టపడి చదివించాడు.. తీరా గవర్నమెంట్ జాబ్ వచ్చాక మరొకరితో..!

భార్యను కష్టపడి చదివించాడు.. తీరా గవర్నమెంట్ జాబ్ వచ్చాక మరొకరితో..!

ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. ఈ వార్త చదివిన తర్వాత ఆడవాళ్ల విజయం వెనుక కచ్చితంగా ఎంతో కొంత మంది మగాళ్లు ఉండే ఉంటారని మీకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే భర్త కష్టం మాత్రం మరెవరికీ రాకూడదు. ఎందుకంటే కట్టుకున్న భార్య నోరు తెరిచి అడిగిందని ఎంతో కష్టపడ్డాడు. ఆమె కోరిక తీర్చేందుకు కష్టపడి చదివించాడు. ఆ తర్వాత ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. ఆ భర్తకు అప్పుడు పట్టలేని సంతోషం కలిగింది. కానీ, ఆ ఉద్యోగం అతని జీవితంలో విషాదం నింపుతుందని మాత్రం అనుకోలేదు. అతను పడ్డ కష్టం కాస్తా అతని పాలిట శాపంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. ఒక యువతి వివాహం చేసుకుంది. పెళ్లైంది కాద అని తన కలలను పక్కన పెట్టలేదు. చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని భర్తకు చెప్పింది. ఆమె కోరిక భర్త సంతోషం వ్యక్తం చేశాడు. ఆమె కలను ఎలాగైనా నెరవేర్చాలని కోరుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎంతో కష్టపడి తన భార్యను చదివించాడు. ఆమె కూడా ఎంతో ఇష్టంగా చదువుకుంది. ఏకంగా సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అయ్యింది. ఆమె ఎప్పుడైతే ఉద్యోగం సాధిచిందో అప్పటి నుంచి ఆ భర్తకు కష్టాలు మొదలయ్యాయి.

ఓ రోజు వేరే ఉద్యోగితో చాటింగ్ చేయడాన్ని భర్త గమనించాడు. ఏంటని ప్రశ్నించగా.. మాములుగానే ఫ్రెండ్ షిప్ కొద్దీ మాట్లాడుతున్నాను అని తప్పించుకుంది. ఈసారి ఆ భర్త వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ భర్తను ఇద్దరూ కలిసి రివర్స్ లో బెదిరించడం ప్రారంభించారు. అతనిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపారు. వచ్చిన తర్వాత అతని ఉద్యోగం కూడా పోయింది. ఆమెకు విడాకులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఆ భర్త ఆరోపిస్తున్నాడు.

ఈ మొత్తం విషయాలను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రూపంలో వెల్లగక్కాడు. తన భార్య తనని ఈ విధంగా మోసం చేసిందని.. తనకు పోలీసులు, అధికారుల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ భర్త కష్టం మరెవరికీ రాకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు. భార్య కోరిక తీర్చాలనుకున్న ఆ భర్తకు ఎంత అన్యాయం జరిగింది అంటూ బాధ పడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet