Hyderabad: ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి.. ఒక్కసారిగా కుప్పకూలడంతో..!

Hyderabad: ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి.. ఒక్కసారిగా కుప్పకూలడంతో..!

Hyderabad: ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి.. ఒక్కసారిగా కుప్పకూలడంతో..!

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్క ఒక్కసారిగా కుప్పకూలింది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఫ్లైఓవర్ కూలడంతో 10 మందికి గాయాలు అయ్యాయి. వారికి ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. సాగర్ రింగ్ రోడ్డులో నూతనంగా పైవంతెనను నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా ఇనుప సువ్వలను పేర్చారు. అయితే ఆ భాగం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది.

ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదంపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షపడేలా చూస్తామన్నారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. గాయపడిన వారు యూపీ, బీహర్ కి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. గాయపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. రోహిత్ కుమార్(25), పునీత్ కుమార్ (25), శంకర్ లాల్(25), రవికుమార్(26), బీహార్ కు చెందిన జితేందర్ కుమార్(26), హరేరామ్(22), విక్కీ కుమార్(23), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంజినీర్ గోపాల కృష్ణ(29)గా గుర్తించారు.

Show comments