iDreamPost
android-app
ios-app

Tomato- Mirchi: టమాటాలు- మిర్చీ చోరీ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు!

సోషల్ మీడియాలో మొత్తం టమాటా, మిర్చి ధరల మీద సెటైర్లు వేయడం చూస్తున్నాం. కట్నం కింద టమాటాలు అడిగారని కొందరు.. మా ఇంట్లో దొంగలు పడి అర కిలో టమాటాలు ఎత్తుకెళ్లారని ఇంకొందరు ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. అయితే నిజ జీవితంలో కూడా అది నిజం అయింది.

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఎండాకాలం పోయినా కూడా ప్రజలకు కూరగాయల ధరల రూపంలో సెగ తగులుతోంది. సోషల్ మీడియాలో మొత్తం టమాటా, మిర్చి ధరల మీద సెటైర్లు వేయడం చూస్తున్నాం. కట్నం కింద టమాటాలు అడిగారని కొందరు.. మా ఇంట్లో దొంగలు పడి అర కిలో టమాటాలు ఎత్తుకెళ్లారని ఇంకొందరు ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. అయితే నిజ జీవితంలో కూడా అది నిజం అయింది.

అవునండి.. టమాటాలు, పచ్చి మిర్చిని దొంగతనం చేశారు. అది కూడా ఎక్కడో కాదు.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని కూరగాయల మార్కెట్ లోనే. గాంధీ సెంటర్ లో ఉన్న కూరగాయల మార్కెట్ లోని ఓ దుకాణంలో కూరగాయలు మాయం అయ్యాయి. షాప్ తెరిచి చూడగా టమాటా, మిర్చీ, చిక్కుడు వండి కూరగాయలు కనిపించలేదు. షాపంతా గందరగోళంగా ఉంది. అన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. యజమాని లబోదిబోమన్నాడు. ఎవరో దుండగులు కూరగాయలను దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. తనకు రూ.50 వేల వరకు నష్టం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. ఆ షాపులో దొంగతనం జరగడం రికార్డు అయింది. మార్కెట్ కాంప్లెక్స్ లో నైట్ వాచ్ మెన్ లేకపోవడం వల్లే దొంగతనాలు జరుగుతున్నట్లు వాపోతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి కూరగాయలు కొనుక్కొస్తుంటే ఇలా దొంగలపాలు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రేట్లు ఇలాగే కొనసాగితే సామాన్యులు సైతం దొంగతనాలు చేయాల్సి వస్తుందేమో అంటూ కొందరు చలోక్తులు విసురుతున్నారు.