iDreamPost
android-app
ios-app

పరాయి మగాళ్లతో సంబంధాల కోసం.. భర్తను అతి దారుణంగా..!

పరాయి మగాళ్లతో సంబంధాల కోసం.. భర్తను అతి దారుణంగా..!

సమాజంలో సంబంధాలు ఎలా తయారవుతున్నాయంటే పెళ్లికి, కుటుంబానికి, ఆఖరికి పిల్లలకు కూడా విలువ ఇవ్వడం లేదు. పెళ్లి చేసుకున్నా కూడా.. ఆ బంధానికి సైతం విలువ లేకుండా నచ్చిన వారితో సబంధాలు పెట్టుకుని తిరిగేస్తున్నారు. వారి పనులకు అడ్డుగా ఉన్నారని భావిస్తే కట్టుకున్న భర్త, భార్య, పిల్లలు అని కూడా చూడటం లేదు. క్షణం కూడా ఆలోచించకుండా కడతేరుస్తున్నారు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిన ఓ మహిళ గురించే చెప్పుకోబోతున్నాం.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాల ప్రకారం.. భర్తను హత్య చేసిన కేసులో కోర్టు తీర్పుతో అసలు విషయం వెలుగు చూసింది. దేముడు, విజయలక్ష్మికి 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె బుద్ధి పెడదారి పట్టి పరాయి మగాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఉదయం బయటకు వెళ్తే.. రాత్రికి ఇంటికి వచ్చేది. ఎక్కడికి వెళ్లింది కూడా చెప్పేది కాదు. ఆ విషయంలో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఇంక భర్తతో వేగడం నా వల్ల కాదు అని విజయలక్ష్మి భావించింది.

తన పనులకు భర్త అడ్డుగా ఉన్నాడని తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా భర్తపై కత్తితో దాడి చేసింది. అతడిని ఆస్పత్రకి తరలించగా.. తర్వాతి రోజు మరణించాడు. అతని సమీప బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విజయలక్ష్మిని అరెస్టు చేశారు. ఈ ఘటన 2019 సెప్టెంబర్ 2న జరిగింది. ఈ కేసులో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. విజయలక్ష్మికి జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా, పిల్లల పేరిట చెరో రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆమె చేసిన పని వల్ల ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetovis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş