iDreamPost
android-app
ios-app

వీడికి రూ.500 అవసరమైతే చాలు.. ఒకరి ప్రాణం పోయినట్లే..!

వీడికి రూ.500 అవసరమైతే చాలు.. ఒకరి ప్రాణం పోయినట్లే..!

సమాజంలో ఎంతో మంది వ్యసనాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కొందరు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే.. ఇంకొందరు వారి వ్యసనాలతో ఎదుటివారి జీవితాలను ఆగం చేస్తున్నారు. వారి పబ్బం గడుపుకోవడానికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాంటి ఒక సైకో కిల్లర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాడు. మద్యం, గంజాయికికి బానిసగా మారి.. డబ్ అవసరం అయినప్పుడల్లా మనుషుల ప్రాణాలు తీయడం ప్రారంభించాడు. గత 14 రోజుల వ్యవధిలోనే 3 హత్యలు చేశాడు. ఆ సీరియల్ కిల్లర్ ని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన ప్రవీణ్ కు చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేసే అవలవాటు ఉంది. ఒక ముఠా కట్టి 2011లోనే రాజేంద్రనగర్ పరిధిలో ఓ ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేశాడు. యాదయ్య అనే ఇంటి యజమానిని రాయితో కొట్టి చంపడమే కాకుండా.. అతని భార్యపై అత్యాచారం చేశారు. తర్వాత గొంతు నులిమి చంపేశారు. వాళ్ల పదేళ్ల కుర్రాడిని కూడా హతమార్చారు. ఆ హత్యల తర్వాత ప్రవీణ్ స్నానం చేసి గుడిలో పూజలు కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నెలల తర్వాత మరో రెండు హత్యలు చేసి జైలు పాలయ్యాడు. యావజ్జీవ శిక్ష పడిన ప్రవీణ్ గత నవంబర్ లో విడుదలయ్యాడు. అప్పటి నుంచి గంజాయి, మద్యానికి బాగా అలవాటు పడ్డాడు.

చేతిలో డబ్బులు లేక మల్లీ హత్యలు చేయడం ప్రారంభించాడు. రూ.500 అవసరమైనప్పుడల్లా హత్యలు చేయడం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడంచారు. మద్యం తాగిన తర్వాత రోడ్లపై తిరుగుతూ.. ఫుట్ పాత్ పై పడుకున్న వారిని టార్గెట్ చేసినట్లు గుర్తంచారు. ఫుట్ పాత్ పై భిక్షాటన చేసే వారి పక్కన కాసేపు నిద్రిస్తున్నట్లు నటించి.. ఆ తర్వాత హత్యలు చేసినట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ హత్యలు ఎందుకు చేశావని ప్రస్నించినప్పుడు ప్రవీణ్ చెప్పిన సమాధానానికి పోలీసులు సైతం విస్తుపోయారు. “చంపేశా అయిపోయింది.. ఏం చేద్దాం” అని తిరిగి ప్రశ్నించాడు. అతని వాలకం చూసి పోలీసులు కూడా షాకయ్యారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom