iDreamPost
android-app
ios-app

బడ్జెట్ లోనే Hyundai Exter.. వేరియంట్స్ పరంగా ధరల వివరాలు!

బడ్జెట్ లోనే Hyundai Exter.. వేరియంట్స్ పరంగా ధరల వివరాలు!

కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్, ఖర్చుల గురించి ఆలోచించి వెనక్కు తగ్గుతూ ఉంటారు. చాలా మంది వారి బడ్జెట్ లో మంచి స్టైలిష్, కంఫర్టబుల్ కారు దొరకడం లేదని కొనకుండా ఉంటారు. అలాంటి వారికోసం హ్యూండాయ్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్తోంది. ఆ కంపనీ నుంచి వస్తున్న ఎక్స్ టర్ మోడల్ ధరలు మొత్తం బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి. ఈ హ్యూండాయ్ ఎక్స్ టర్ కి సంబంధించిన అన్ని వేరియంట్స్ ధరలను ప్రకటించారు.

హ్యూండాయ్ నుంచి వస్తున్న ఎక్స్ టర్ మోడల్ కు మార్కెట్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఈ కారుకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు ధరల వివరాలు వెల్లడించిన తర్వాత వారి అభిమానం మరింత పెరిగిపోతోంది. ఎందుకంటే హ్యూండాయ్ ఎక్స్ టర్ మోడల్ ధరలు అన్నీ బడ్జెట్ రేంజ్ లో ఉండటం గమనార్హం. కొత్తగా కారు కొనాలి అనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అంటూ ఆటోమొబైల్ నిపుణులు కూడా చెబుతున్నారు. పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్ తో ఈ కారు వస్తోంది. ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ లో అందుబాటులో ఉంది. ఇంజిన్ టైప్, ట్రాన్స్ మిషన్, వేరియంట్ ని బట్టి కారు ధర అనేది మారుతూ ఉంటుంది.

1.2 పెట్రోల్ మాన్యూవల్:

  • ఈఎక్స్ వేరియంట్ ధర రూ.6 లక్షలు
  • ఎస్ వేరియంట్ ధర రూ.7.27 లక్షలు
  • ఎస్ఎక్స్ వేరియంట్ ధర రూ.8 లక్షలు
  • ఎస్ఎక్స్(ఓ) వేరియంట్ ధర రూ.8.64 లక్షలు
  • ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ వేరియంట్ ధర రూ.9.32 లక్షలు

పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ వేరియంట్స్ ధరలు:

  • ఎక్స్ వేరియంట్ రూ.7.97 లక్షలు
  • ఎస్ఎక్స్ వేరియంట్ రూ.8.68 లక్షలు
  • ఎస్ఎక్స్(వో) వేరియంట్ రూ.9.32 లక్షలు
  • ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ వేరియంట్ రూ.10 లక్షలు

సీఎన్జీ ఆటోమేటిక్ ధరలు:

  • ఎస్ వేరియంట్ ధర రూ.8.24 లక్షలు
  • ఎస్ఎక్స్ వేరియటం ధర రూ.8.97 లక్షలు

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş