iDreamPost
android-app
ios-app

మొబైల్ నుంచే కాదు.. ల్యాప్ ట్యాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు.. ఎలాగంటే?

మొబైల్ నుంచే కాదు.. ల్యాప్ ట్యాప్ నుంచి కూడా వాట్సాప్ కాల్ చేయచ్చు.. ఎలాగంటే?

ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఏ యాప్ ఉన్నా లేకపోయినా.. వాట్సాప్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ సోషల్ మీడియా యాప్ ని వినియోగిస్తున్నారు. వాట్సాప్ నుంచి నెలకో ఫీచర్ వస్తూనే ఉంటుంది. వాట్సాప్ ని మీరు ఫోన్ లో మాత్రమే కాకుండా ల్యాప్ ట్యాప్ లోకూ డా వినియోగించవచ్చు. మీరు ఫోన్ లో ఎలా అయితే వాట్సాప్ ని వినియోగిస్తారో.. అలాగే పీసీ, ల్యాప్ ట్యాప్ లోకూడా మీరు వాట్సాప్ ని వాడచ్చు. కానీ ఫోన్ కి పీసీకి ఒకటే తేడా ఉంటుంది. అదేంటంటే.. ఫోన్ లో మీరు వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేయచ్చు. కానీ, పీసీ ద్వారా మాత్రం కాల్స్ చేసే అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మీరు పీసీ, ల్యాప్ ట్యాప్ ద్వారా కూడా ఆడియో, వీడియో కాల్స్ చేయచ్చు. అది ఎలాగో చూడండి.

మీరు నేరుగా వాట్సాప్ వెబ్ ద్వారా ఈ ఫీచర్స్ ని వాడలేరు. అందుకు వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ కావాలి. మీరు వెబ్ వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేయలేరు. పీసీ లేదా ల్యాప్ ట్యాప్ ద్వారా ఆడయో, వీడియో కాల్స్ చేయాలి అంటే మీ పీసీ/ల్యాప్ ట్యాప్ లో మైక్, ఆడియో అవుట్ పుట్, వీడియో కాల్స్ కోసం కెమెరా కూడా ఉండాలి. ఫోన్, ల్యాప్ ట్యాప్ కచ్చితంగా యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఈ ఫీచర్స్ ఐవోఎస్ 10.13, విడోస్- 10 64 బిట్ వెర్షన్ ఆ పైబడిన వాటిలో మాత్రమే వీలవుతుంది.

పీసీ, ల్యాప్ ట్యాప్ లో ముందుగా వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ ని ఓపెన్ చేయాలి. క్యూర్ కోడ్ స్కాన్ చేసి మీ వాట్సాప్ అకౌంట్ ని యాక్సెస్ చేయాలి. మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకున్నారో.. వారి చాట్ ని ఓపెన్ చేయాలి. పైన మీకు కాల్స్ కి సంబంధించిన ఐకాన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే మీ కాల్ స్టార్ట్ అవుతుంది. అదే వీడియో కాల్ కి కూడా సిబంల్ ఉంటుంది. దానిని మీద క్లిక్ చేస్తే.. వీడియో కాల్ స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు మీ పీసీ/ల్యాప్ ట్యాప్ లో వాయిస్, వీడియో కాల్స్ చేయచ్చు.