iDreamPost
android-app
ios-app

దృశ్యం సినిమా సీన్ రిపీట్! వామ్మో.., ప్రియుడి కోసం కన్న కొడుకునే..!

  • Published Jul 03, 2023 | 1:42 PM Updated Updated Jul 03, 2023 | 2:50 PM
  • Published Jul 03, 2023 | 1:42 PMUpdated Jul 03, 2023 | 2:50 PM
దృశ్యం సినిమా సీన్ రిపీట్! వామ్మో.., ప్రియుడి కోసం కన్న కొడుకునే..!

ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భర్తతో బాగానే సంసారం చేసింది. భర్త ఓ చోట, భార్య ఓ చోట కూలీ పని చేస్తూ సంసారాన్ని కొనసాగించారు. అలా కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. కొడుకుని చూసి ఈ భార్యాభర్తలు సంబరపడ్డారు. వీరి కొడుకుకి రెండేళ్ల వయసొచ్చింది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఈ ఇల్లాలు పక్క చూపులు చూసింది. భర్తను కాదని మరొక మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ప్రియుడిపై కోరికలు పెంచుకుని అతనికి మరింత దగ్గరైంది. ఇక ప్రియుడితో సుఖానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ సూరత్ పరిధిలోని దిండోలి ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఓ కుమారుడు జన్మించాడు. అలా కొన్నేళ్లు గడిచింది. కొడుకు బుడి బుడి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె స్థానికంగా కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇదే టైమ్ లో ఈ మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే ఇద్దరు రాను రాను ఇంకాస్త దగ్గరయ్యారు. ఇక ఈ బంధం కాస్త చివరికి వివాహేతర సంబంధంగా మారిపోయింది. సమయం దొరికినప్పుడల్లా ఈ మహిళ ప్రియుడితో గడుపుతూ ఉండేది. ఇకపోతే, ప్రియుడితో గడిపేందుకు తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఈమెకు ఓ ఐడియా తట్టింది. అదే తన కొడుకుని చంపడం. అనుకున్నదే ఆలస్యం.. ఈ దుర్మార్గురాలు తన రెండేళ్ల కుమారుడు అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత కొడుకు మృతదేహన్ని దృశ్యం సినిమా సీన్ రిపీట్ చేస్తూ.. టాయిలెట్ లో గుంత తీసి అందులో పూడ్చి పెట్టింది.

ఇక ఏం తెలియనట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ.. నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నా కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ చిన్నారి కనిపించకుండా పోయిన చోట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ బుడ్డోడు మిస్ అయినట్లు ఎక్కడా కూడా ఆనవాళ్లు కనిపించలేదు. కానీ, ఎందుకో పోలీసులకు ఆ చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. అసలేం జరిగిందంటూ పోలీసులు నిజాన్ని రాబట్టేందుకు తల్లిని ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు ఆ మహిళ నోట్లో నీళ్లు నమిలి నా కుమారుడిని నా ప్రియుడు కిడ్నాప్ చేశాడంటూ మరో డ్రామాకు తెర లేపింది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, అతని జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు. పోలీసులు ఆ మహిళను మరోసారి గట్టిగా ప్రశ్నించే సరికి అసలు నిజాన్ని బయటపెట్టింది. నా ప్రియుడితో గడిపేందుకు నా కుమారుడు అడ్డుగా ఉన్నాడరి, దీని కారణంగానే అతడిని నేనే చంపానని వివరించింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ బాత్ రూమ్ లో గుంత తీసి అందులో పూడ్చి పెట్టానని తెలిపింది. ఇక పోలీసులు ఆ చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు నిందితురాలైన తల్లిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ గుజరాత్ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş