iDreamPost
android-app
ios-app

Airpods: యాపిల్ ఎయిర్ పాడ్స్ పై రూ.20 వేల డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరు!

Airpods: యాపిల్ ఎయిర్ పాడ్స్ పై రూ.20 వేల డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరు!

ప్రపంచ మార్కెట్ లో యాపిల్ ప్రొడక్టులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి కేవలం గ్యాడ్జెట్స్ మాత్రమే కాదు.. స్టేటస్ సింబల్ కూడా. ముఖ్యంగా యువతలో యాపిల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ అంటే మహా పిచ్చి ఉంటుంది. కానీ, కొనాలంటే మాత్రం యాపిల్ ప్రొడక్ట్స్ చాలా ఖరీదుగా ఉంటాయి. అందుకే ఎంతో మంది వెనక్కు తగ్గుతూ ఉంటారు. కానీ, ధర ఎక్కువని కొనకుండా వెనక్కి తగ్గుతున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. ఎందుకంటే యాపిల్ ఎయిర్ పోడ్స్ పై ఏకంగా రూ.20 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు.

యాపల్ సంస్థ ఆన్ లైన్ స్టోర్ లో ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ ధర రూ.59,900గా ఉంటుంది. అయితే ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్టులో మాత్రం రూ.20 వేల డిస్కౌంట్ లభిస్తోంది. అయితే అన్నీ యాపిల్ ఎయిర్ పాడ్స్ పై ఈ ఆఫర్ అందుబాటులో లేదు. కేవలం పింక్ కలర్ యాపిల్ ఎయిర్ పాడ్స్ హెడ్ సెట్ పై మాత్రమే ఈ ఆఫర్ లభిస్తోంది. వీటి ధర రూ.59,900 కాగా రూ.19,901 తగ్గిస్తూ రూ.39,999కే అందిస్తున్నారు. ఇందుకు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.1,250 డిస్కౌంట్, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

ఈ మోడల్ లో సిల్వర్, గ్రీన్ కలర్ ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ హెడ్ సెట్ ధర మాత్రం రూ.44,999గా ఉంది. దీనిపై రూ.3 వేలు హెచ్ డీఎఫ్సీ క్రెడట్ కార్డు డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఎయిర్ పాడ్స్ ప్రోపై కూడా క్రేజీ డిస్కౌంట్ లభిస్తోంది. వీటి మార్కెట్ ధర రూ.24,990గా ఉంది. కానీ, ఫ్లిప్ కార్టులో మాత్రం రూ.16,990కే సేల్ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet