iDreamPost
android-app
ios-app

EVపై 36 వేలు డిస్కౌంట్.. కేవలం 500 కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు!

EVపై 36 వేలు డిస్కౌంట్.. కేవలం 500 కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు!

ఈ మధ్య కాలంలో అంతా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకే చూస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో వాటిపై రాయితీ తగ్గించడంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు చేసే విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి వారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఎలక్ట్రిక్ స్కూటీపై ఏకంగా రూ.36 వేలు డిస్కౌంట్ ని అందిస్తున్నారు. మీరు ఈవీ కొనుగోలు చేయాలని చూస్తుంటే మాత్రం ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పచ్చు.

ప్రముఖ ఈవీ కంపెనీల్లో ఒకటైన యాంపియర్ సంస్థ ఇప్పటికే మార్కెట్ లో పలు మోడల్స్ ఈవీలను విక్రయిస్తోంది. ఈ మోడల్స్ లో ఒకటైన మ్యాగ్నస్ ఈఎక్స్ బండిపై అద్భుతమైన ఆఫర్ కొనసాగుతోంది. ఈ స్కూటర్ ని మీరు ఏకంగా రూ.36 వేలు తక్కువకు పొందవచ్చు. దీని ధర రూ.1,26,365గా ఉంది. అయితే బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు స్పెషల్ ఫెసిలిటీ ఉంది. వాళ్లు ఈ బైక్ ని కేవలం రూ.90 వేలకే కొనుగోలు చేయచ్చు.

ఇందులో రూ.81,900 ఎక్స్ షోరోమ్ ధర కాగా.. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూ.8 వేలు ఉంది. కేవలం రూ.500 కట్టి మీరు ఈ బైక్ ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మీరు దీనిని ఈఎంఐలో కూడా కొనుగోలు చేయచ్చు. 36 నెలల గరిష్ట టెన్యూర్ ను ఎంచుకునే అవకాశం ఉంది. రూ.27 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి బైక్ ఇంటికి తీసుకెళ్లచ్చు. నెలకు రూ.2,325 చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బండి ఫీచర్స్ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలో మీటర్ల వరకు వెళ్లచ్చు.

ఇది రెడ్, బ్లూ, బ్లాక్, వైట్, గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది. కేవలం 10 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా 50 కిలీ మీటర్ల వేగంతో వెళ్లగలదు. ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంది. ఈ బండి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 8 గంటల వరకు సమయం పడుతుంది. ఈ బండిపై 5 ఏళ్ల వారెంటీ కూడా లభిస్తుంది. ఈ బండి ఫీచర్స్, దీని ధర గురించి తెలుసుకున్న తర్వాత ఈవీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio