iDreamPost
iDreamPost
 
        
ఇటీవల వరుస పరువు హత్యలు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి, పోలీసులకు సవాలుగా విసురుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో సరూర్ నగర్, బేగంబజార్ లలో పరువు హత్యలు, ద్వారకా తిరుమలలో పరువు దాడి ఇవి మరువకముందే మరో చోట పరువు హత్య జరిగింది.
ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటే సొంత వాళ్ళే కడతేరుస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. నార్నూర్ మండలం నాగల కొండలో రాజేశ్వరి అనే యువతి వేరే మతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువతి తల్లిదండ్రులు ఈ ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో నెల కిత్రం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది.
దీంతో తమ మాట కాదని వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని తమ పరువు తీసిందని కూతురిపై తల్లిదండ్రులు పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో కన్న కూతురు అని చూడకుండా శుక్రవారం ఉదయం కత్తితో గొంతుకోసి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది.
