iDreamPost
android-app
ios-app

NTR 30కి రంగం సిద్ధం

  • Published Jul 11, 2022 | 12:23 PM Updated Updated Jul 11, 2022 | 12:37 PM
NTR 30కి రంగం సిద్ధం

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు మొదలవుతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆచార్య ఊహించని విధంగా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో కొరటాల ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నారు. మరోవైపు తారక్ సైతం పలు సూచనలు మార్పులు చేసి సహకరిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే చాలా ఆలస్యమైనప్పటికీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో రెగ్యులర్ షూట్ కు వెళ్లడంలో ఇంకా జాప్యం కొనసాగుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారు. క్లైమాక్స్ కు సంబంధించి హైదరాబాద్ లో ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. అదే ముందు తీసే అవకాశాలున్నాయి.

ఆర్ఆర్ఆర్ ఎంత బ్లాక్ బస్టర్ అయినా అందులో రామ్ చరణ్ కు షేర్ ఉంది కాబట్టి సోలో హీరోగా యంగ్ టైగర్ సక్సెస్ కోసం ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. అరవింద సమేత వీర రాఘవ వచ్చి నాలుగేళ్లకు దగ్గరవుతుంది. ఇప్పుడీ సినిమా 2023 వేసవి కన్నా ముందే వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ కంబ్యాక్ తమ కరువునంతా తీర్చాలని కోరుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం దీనికి ప్రధాన ఆకర్షణ.