iDreamPost
android-app
ios-app

Kinnerasani : విడుదలకు సిద్ధం అయినా చుట్టూ పద్మవ్యూహం

  • Published Jan 19, 2022 | 9:19 AM Updated Updated Jan 19, 2022 | 9:19 AM
  • Published Jan 19, 2022 | 9:19 AMUpdated Jan 19, 2022 | 9:19 AM
Kinnerasani : విడుదలకు సిద్ధం అయినా చుట్టూ పద్మవ్యూహం

కేవలం మెగాస్టార్ చిన్నల్లుడు అనే ఒకే కారణంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్ కి వ్యవహారం అంత సులభంగా సాగడం లేదు. మొన్న విడుదలైన సూపర్ మచ్చి దారుణంగా ఫెయిలై ఏకంగా నెగటివ్ షేర్లు తీసుకురావడం ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. కనీసం మెగా ఫ్యాన్స్ లో కొందరు సపోర్ట్ చేసినా ఓ మాదిరి వసూళ్లు వస్తాయి. కానీ అది కనీస స్థాయిలో జరగలేదు. కారణం అసలు మెగా కాంపౌండ్ నుంచే ఎవరూ దీన్ని పట్టించుకోకపోవడం. సినిమా బాగుందా బాలేదా అనేది పక్కనపెడితే మినిమమ్ ఓపెనింగ్స్ కు సైతం ఇది నోచుకోలేకపోయింది. కొన్ని ఏరియాల్లో ఈ నెల 21 రిలీజ్ అంటూ కొత్తగా పబ్లిసిటీ చేస్తున్నారు కానీ ఒరిగేది పెద్దగా ఉండదు.

ఈ కళ్యాణ్ దేవ్ త్వరలోనే శ్రీజతో విడాకులు తీసుకోబోతున్నాడనే ప్రచారం ఈ పరిస్థితికి కారణంగా కొందరు విశ్లేషకులు అంటున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో శ్రీజ తన పేరులో కళ్యాణ్ ని తీసేయడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో జరిగిన ఏ మెగా ఫ్యామిలీ మీటింగ్ లోనూ కళ్యాణ్ దేవ్ లేడు. మొన్న సంక్రాంతికి చిరంజీవి వేసిన దోసెల క్యాంప్ లో తనొక్కడే మిస్సింగ్. ఇప్పుడీ ప్రభావం నేరుగా 26న రావాల్సిన కిన్నెరసాని మీద పడుతోంది. రామ్ తాళ్ళూరి నిర్మాతగా అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ ఇప్పుడు వాయిదా దిశగా వెళ్తోంది. దానికి కారణం ఈజీగా గెస్ చేయొచ్చు.

ఒకవేళ పైన చెప్పినదేది జరగక పోయి ఉంటే సూపర్ మచ్చి పోయినా కిన్నెరసానికి డీసెంట్ రన్ దక్కేది. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యింది. కేవలం మెగా అల్లుడు అనే కారణంతో కిన్నెరసాని తీసిన రామ్ తాళ్ళూరి ఇప్పుడు ఎంత చనువు ఉన్నా పవన్ ని గెస్ట్ గా తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేరు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ చేయబోయే సినిమా ప్రొడ్యూసర్ ఈయనే. అయితే ఇప్పుడు కిన్నెరసానిని ధైర్యం చేసి థియేటర్లలోకి తీసుకొస్తారా లేక ఓటిటి వైపు చూస్తారా అనేడిస్ సస్పెన్స్ గా మారిపోయింది. నేరుగా అడుగుదామంటే కళ్యాణ్ దేవ్ కనీసం మీడియాకు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఇదంతా చిక్కుముడే మరి

Also Read : Bhavadeeyudu Bhagat Singh : పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్ ?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom