iDreamPost
android-app
ios-app

ఘనంగా నితిన్ – శాలినిల నిశ్చితార్థం..

ఘనంగా నితిన్ – శాలినిల నిశ్చితార్థం..

సినీనటుడు నితిన్ – శాలినిల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరి పెళ్ళికి ఇరువైపుల కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నితిన్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.

ఈరోజు జరిగిన నిశ్చితార్థపు ఫోటోలను నితిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి పెళ్లి పనులు మొదలయ్యాయని అందుకు మీ అందరి దీవెనలు కావాలని కోరాడు.. ఇటీవల ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాలిని కందుకూరి ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని, ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని రివీల్ చేసి తనకో ప్రేమకథ ఉందని ట్విస్ట్ ఇచ్చాడు నితిన్..

శాలిని UK లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం ప్రేమకి దారితీసింది.. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వాళ్ళు కూడా పెళ్ళికి ఒప్పుకోవడంతో నితిన్ శాలినిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.. పెళ్లి ఏప్రిల్ 16 న దుబాయ్ లో జరగనుంది..

నితిన్ పెళ్లి పనులు మొదలయ్యాయి.. మ్యూజిక్ స్టార్ట్స్ అని నిశ్చితార్థపు ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet