iDreamPost
iDreamPost
నిన్న మాచర్ల నియోజకవర్గం కొత్త విడుదల తేదీని ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. జూలై నుంచి ఆగస్ట్ 12కి షిఫ్ట్ చేస్తూ ఫ్రెష్ పోస్టర్ ని వదిలారు. ఇలా వాయిదాలు, డేట్ల మార్పులో ఆశ్చర్యం లేదు కానీ అక్కడ రిస్క్ పొంచి ఉందని తెలిసి కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం పట్ల రకరకాల కోణాల్లో విశ్లేషణ జరుగుతోంది. అదే రోజు అఖిల్ ఏజెంట్ వస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో మమ్ముట్టి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటిదాకా సాఫ్ట్ లవ్ స్టోరీస్ మాత్రమే చేసుకుంటూ వచ్చిన అక్కినేని వారసుడికి ఇది ఖచ్చితంగా మాస్ ఇమేజ్ తెస్తుందనే కాన్ఫిడెన్స్ యూనిట్ లో, ఫ్యాన్స్ లో ఉంది.
సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి చాలా హోమ్ వర్క్ చేసి రాసుకున్న స్క్రిప్ట్ ఇది. అందుకే గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. సో నేరుగా దానితో తలపడటం అంటే నితిన్ మూవీలో కంటెంట్ ఉన్నట్టే. సమంతా టైటిల్ రోల్ పోషిస్తున్న యశోద కూడా 12కే ఫిక్స్ అయ్యింది. ఏజెంట్ డేట్ అఫీషియల్ అయ్యాక అది గుర్తుంచుకునే సామ్ టీమ్ ఇలా ప్లాన్ చేసుకోవడం అనూహ్యం. సరే ట్రయాంగిల్ పోటీ సరిపెట్టుకుందాం అనుకోవడానికి లేదు. ఆగస్ట్ 11న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా వస్తుంది. ఇందులో నాగ చైతన్య చెప్పుకోదగ్గ లెన్త్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. అంచనాలు ప్యాన్ ఇండియా లెవెల్ లో ఉన్నాయి. ఓపెనింగ్స్ ఊహకందటం లేదు.
మరి ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్య నితిన్ దిగడం అనేది అసహజం కాదు కానీ వరస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ యువ హీరోకు పెద్ద బ్రేక్ అవసరం. చెక్, రంగ్ దే, మాస్ట్రో ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. భీష్మ తర్వాత ఆ స్థాయి విజయం మళ్ళీ అందుకోలేకపోయారు. ఈ మాచర్ల నియోజకవర్గంలో కమర్షియల్ ఎలిమెంట్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. కాకపోతే డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి. ఉప్పెన నుంచి ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటించడం మరో ఆకర్షణ. అన్నట్టు ఏజెంట్ 12కే వస్తుందా లేక రాదనీ తెలిసే మాచర్లను లాక్ చేశారా అనే ప్రచారం కూడా జరుగుతోంది