iDreamPost
android-app
ios-app

సెట్స్ పైకి వెళ్లనున్న స్పెషల్ కాంబో

  • Published Jul 07, 2021 | 10:37 AM Updated Updated Jul 07, 2021 | 10:37 AM
సెట్స్ పైకి వెళ్లనున్న స్పెషల్ కాంబో

ఈ ఏడాది ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని విధంగా ఏకంగా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకున్న నితిన్ కు ఫలితం మాత్రం ఆశించిన విధంగా దక్కలేదు. చెక్ దారుణంగా డిజాస్టర్ కాగా రంగ్ దే ఓ మోస్తరుగా ఆడిందే తప్ప మొత్తం పెట్టుబడిని వెనక్కు ఇవ్వలేకపోయింది. లాక్ డౌన్ రాక ముందే ఇవి రిలీజ్ అయిన ఆనందం పెద్దగా లేకపోయింది. ఇటీవలే అందాదున్ రీమేక్ మాస్ట్రో పూర్తి చేసి దాని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ వాస్తవానికి కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట చేయాల్సి ఉంది. కానీ ఎందుకో మరో దాని బదులు ఇప్పుడు వక్కంతం వంశీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోందట. ఆ మేరకు అగ్రిమెంట్ కూడా అయిపోయిందని సమాచారం. ప్రస్తుతం రాధే శ్యామ్ చివరి లెగ్ షూట్ లో ఉన్న పూజా అదయ్యాక కమిట్ అయిన చిత్రం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో ఒకటే. అది కూడా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్రెడీ లాక్ చేసుకున్నారట. అది కాకుండా నితిన్ మూవీకి మాత్రమే సైన్ చేసినట్టు ఫిలిం నగర్ న్యూస్. అయితే ఇంత భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పూజా హెగ్డేని తీసుకున్నారంటే నితిన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. రంగ్ దేలో కీర్తి సురేష్, ఇప్పుడు పూజా అంటే మార్కెట్ ని గట్టిగానే దృష్టిలో పెట్టుకుంటున్నారు.

దీని తాలూకు పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. గత ఏడాది భీష్మ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కిక్ ఎక్కువ కాలం నిలవకపోవడం ఫాన్స్ ని నిరాశపరిచింది. మాస్ట్రో కూడా ఓటిటి రిలీజ్ అనే ప్రచారం జరుగుతోంది కానీ యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. 32 కోట్లకు ఇచ్చేశారని అంటున్నారు. అయితే త్వరలోనే థియేటర్లు తెరుచుకోబోతున్న నేపథ్యంలో మళ్ళీ మనసు ఏమైనా మార్చుకుంటారేమో తెలియదు. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన మాస్ట్రోలో తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş