iDreamPost
iDreamPost
ఇటీవల సోషల్ మీడియా యాప్స్ మరింత అప్‌డేట్ అవుతూ యూజర్లకి కొత్త కొత్త ఫీచర్లని అందిస్తున్నాయి. కొత్త ఫీచర్లని అందించడానికి సోషల్ మీడియా యాప్స్ ఎప్పటికప్పుడు పోటీ పడుతున్నాయి. పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ తన యూజర్లకి కొత్త కొత్త ఫీచర్లని అందిస్తుంది. తాజాగా ఓ కొత్త ఫీచర్ ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దాంతో పాటు మరో రెండు అప్‌డేట్‌లు కూడా చేయనుంది.
వాట్సాప్ చాటింగ్ కి ఎమోజీ రియాక్షన్ ఫీచర్ తీసుకొస్తున్నట్టు గత నెలలోనే ప్రకటించారు. మరో వారంరోజుల్లో యూజర్లందరికి ఈ ఫీచర్ రానుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లో ఈ ఫీచర్ ఉంది. వాట్సాప్ యాప్‌ని అప్‌డేట్ చేస్తే ఈ ఎమోజీ రియాక్షన్ ఫీచర్ యాడ్ అవుతుంది. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్‌లలో మెసేజ్‌లకు ఎమోజీతో రియాక్షన్ ఇవ్వొచ్చు.
ఎమోజీ రియాక్షన్ రావాలంటే ఇలా చేయాలి..
ఏదైనా పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌లోకి వెళ్లి మీరు రియాక్ట్ అవ్వాలనుకున్న మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే మనకి ఎమోజీల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులోని ఏదైనా ఎమోజీని ఎంచుకొని ఆ మెసేజ్ కి రియాక్షన్ గా ఇవ్వొచ్చు. ఒకవేళ మన మెసేజ్‌కు ఎవరైనా రియాక్ట్ అయినా మనకి నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం రాబోయే ఈ ఫీచర్ లో ఆరు ఎమోజీలు ఉన్నాయి. లైక్, లవ్ (రెడ్ హార్ట్), స్మైల్, సర్‌ప్రైజ్, స్యాడ్, థ్యాంక్స్ ఎమోజీలు ఉన్నాయి. త్వరలో మరిన్ని ఎక్స్‌ప్రెషన్స్ కూడా జతచేస్తామని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ యూజర్లందరికి రావడానికి మరో వారం రోజులు పట్టొచ్చు.
అంతేకాకుండా ప్రస్తుతం ఓ వాట్సాప్ గ్రూప్‌లో మ్యాగ్జిమమ్ 256 మంది ఉండేలా అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్యను 512కు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని వాట్సాప్ పేర్కొంది. అలాగే ప్రస్తుతం 100MB ఫైల్ వరకు మాత్రమే మనం వాట్సాప్ లో షేర్ చేసుకోగలం. భవిష్యత్తులో 2GB వరకు ఫైల్స్‌ను షేర్ చేసుకునేలా వాట్సాప్ ని అప్‌డేట్ చేయనున్నారు.