iDreamPost
android-app
ios-app

నేటి నుంచే కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు.. అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు!

New Driving License: దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది.

New Driving License: దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది.

నేటి నుంచే కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు.. అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు!

గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణలకు ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నా వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. నిర్లక్ష్యం, అతి వేగం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేసింది.. అవి నేటి నుంచి (జూన్1 ) నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే.. మీ జేబుకు చిల్లు పడినట్లే. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటీ.. ఎంత వరకు జరిమానా విధిస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దేశంలో నిత్యం జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. అతి వేగంతో వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.500 జరిమానా.. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా.. రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ పొందే వయసు 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కలిగి ఉండాలి. మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు సదరు మైనర్ కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎలాంటి లైసెన్స్ జారీ చేయబడదు.

నేటి నుంచి అమలు అయ్యే ప్రతి ఒక్క నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే మూల్యం తప్పదని అధికారులు అంటున్నారు. దీంతో పాటు ఈ రోజు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా.. డ్రైవింగ్ స్కూల్ కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం కల్పించారు. దీంతో ఆర్టీఏ ఆఫీస్ ముందు పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. కేంద్రం తీసుకు వచ్చిన రూల్స్ ట్రాఫిక్ సిబ్బంది కఠినంగా పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సీసీ టీవీలు కూడా పర్యవేక్షిస్తుంటాయని.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు తప్పవని.. వాహనదారులు ఇది గుర్తుంచుకొని డ్రైవింగ్ చేయాలని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి