iDreamPost
iDreamPost
హాంకాంగ్‌తో జరిగిన ఆసియా కప్ 2022 మ్యాచ్ 160-170 మధ్యలో స్కోర్ ఆగాల్సింది. కాని సూర్య కుమార్ 24 బంతుల్లో అజేయంగా 68 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, గేర్ మార్చాడు. 192 రన్స్ కు తీసుకెళ్లాడు. నిజానికి పిచ్ అంత బ్యాటింగ్ కు అనుకూలంగా లేదు. కాబట్టే, భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ వంగి సలాం పెట్లాడు.
సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్. బుధవారం మ్యాచ్ లో హాంకాంగ్‌పై 24 బంతుల్లో అజేయంగా 68 పరుగులు చేశాడు. స్కోరు 13 ఓవర్లలో 94/2తో ఉన్నప్పుడు రన్-రేట్ బూస్ట్ కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్, తరువాతి ఏడు ఓవర్లలో, కోహ్లితో కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్‌ను 192/2 స్కోరుకు తీసుకెళ్లారు. ఇండియా చివరకు 40 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది
సూర్యకుమార్ ఆఖరి ఓవర్లలో, నాలుగు సిక్సర్లతో సహా 26 పరుగులు చేశాడు. అప్పుడే కోహ్లి సూర్యకుమార్ హిట్టింగ్‌కు గౌరవసూచకంగా నమస్కరించాడు. మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో, సూర్యకుమార్ కోహ్లీ వందనం గురించి మాట్లాడాడు. తాను అలాంటిదేమీ “ఎప్పుడూ చూడలేదు” అని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, నేను అతనిని చూస్తూ, “ఎందుకు అతను ముందుకు వెళ్ళడం లేదు?” అని అతని వద్దకు వచ్చి, కలిసి నడవమని కోరికా. తాను మాత్రం నన్ను ముందు వెళ్లమని, అక్కడే అలా ఉన్నాడు. ఇదో గొప్ప అనుభవం” అని సూర్యకుమార్ చెప్పాడు.
సూర్య హార్డ్ హిట్టింగ్ కి విరాట్ కోహ్లి ఫిదా అయ్యాడు. దీంతో అతడి వంగి సలాం చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.