iDreamPost
android-app
ios-app

అషురెడ్డిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఇదే..

  • Published May 27, 2022 | 7:47 PM Updated Updated May 27, 2022 | 8:05 PM
  • Published May 27, 2022 | 7:47 PMUpdated May 27, 2022 | 8:05 PM
అషురెడ్డిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఇదే..

టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా ఫేమస్ తెచ్చుకొని, యూట్యూబర్ గా మారి ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని బాగా పాపులర్ అయింది అషురెడ్డి. ఇప్పుడు పలు సినిమాల్లో నటిగా, యాంకర్ గా బిజీబిజీగా ఉంది అషురెడ్డి. ఇటీవల మళ్ళీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది అషు. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు, రీల్స్ పెడుతూ హడావిడి చేస్తూ ఉంటుంది.

తాజాగా అషురెడ్డి షేర్‌ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కంటెస్టెంట్‌ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌ పై ఓ రీల్‌ చేసింది అషూ. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?’ అనే డైలాగ్ ని చెప్పింది. ఈ డైలాగ్‌ విని పక్కనే ఉన్న అజయ్‌ అషూ తలపై కొట్టాడు.

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. మీ మనసులోని మాటను కామెంట్‌ చేయండి అని పోస్ట్ చేసింది అషు. దీంతో నెటిజన్లు రకరకాలుగా అషుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘ముందు మేకప్‌ తీసి రీల్‌ చేయ్‌ లైక్స్ కూడా రావు’, ‘గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు’, ‘ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్‌ చేయ్‌’, ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే’ అంటూ దారుణంగా నెటిజన్లు అషురెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetcratosroyalbetcasibomcasibomcasibombetcio giriş