విజేత విలన్ అయ్యాడు! ఓడిన అమర్ మాత్రం హీరో అయ్యాడు: నెటిజన్స్

Amardeep- Pallavi Prashanth Behaviour After Bigg Boss: బిగ్ బాస్ సీజన్ అట్టహాసంగా ముగిసింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ రిమాండు ఖైదీగా మారాడు. ప్రస్తుంత చంచల్ గూడ జైలులో ఉన్నాడు.

Amardeep- Pallavi Prashanth Behaviour After Bigg Boss: బిగ్ బాస్ సీజన్ అట్టహాసంగా ముగిసింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ రిమాండు ఖైదీగా మారాడు. ప్రస్తుంత చంచల్ గూడ జైలులో ఉన్నాడు.

పల్లవి ప్రశాంత్ గురించి అతని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ రిమాండు ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అతని సోదరుడు కూడా అరెస్టై 14 రోజుల రిమాండుకు వెళ్లాడు. అతనికి ఎంత శిక్షష పడుతుంది? బెయిల్ వస్తుందా.. రాదా? అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరోవైపు ప్రశాంత్ విషయంలో కొన్ని అభిప్రాయాలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా అమర్ దీప్- పల్లవి ప్రశాంత్ ని కంపేర్ చేస్తూ కొందరు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. విన్నర్ ప్రశాంత్ కంటే కూడా రన్నరప్ అమర్ దీప్ ఎంతో గ్రేట్ అంటూ చెబుతున్నారు. అందుకు హౌస్ లో వారి ప్రవర్తనను ఉదాహరణగా చూపిస్తున్నారు.

అమర్ దీప్ కు బిగ్ బాస్ జరిగినన్ని రోజులు నెట్టింట ఎక్కడలేని నెగిటివిటీని తెచ్చిపెట్టారు. అతని ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. నిజానికి అమర్ దీప్ హౌస్ లో ఎతో జెన్యూన్ గా ఉన్నట్లు అనిపించింది. కాకపోతే ఫౌల్ గేమ్స్ వల్ల ఎక్కువ మంది ట్రోల్ చేశారు. హౌస్ మేట్స్ కూడా అమర్ దీప్ ఫౌల్ గేమ్ గురించే ఎక్కువ మాట్లాడారు. అంతేకాకుండా కొన్ని సందర్భల్లో అమర్ విలన్ మాదిరిగా కనిపించాడు. తనని తాను కూడా విలన్ గానే పరిచయం చేసుకున్నాడు. తాను బ్యాడ్ బాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. శివాజీ కూడా అమర్ దీప్ గురించి మాట్లాడుతూ పదే పదే వేస్ట్ ఫెలో.. వాడు ఏం ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్ గురించి మాత్రం వాడు గెలవడానికే వచ్చాడు.. వాడు గెలుస్తాడు అంటూ భుజం తట్టాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు పల్లవి ప్రశాంత్ అందరికీ హీరోలాగే కనిపించాడు. రైతుబిడ్డగా ఎంతో సింపథీ కూడా వచ్చింది. ప్రతి టాస్కులో గెలుస్తూ విన్నర్ అయ్యాడు. అలాగే మాటలతో కూడా ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు.

సీజన్ ముగిసిన తర్వాత అంతా రివర్స్ అయిపోయింది అంటున్నారు. విలన్ అనుకున్న అమర్ దీప్ మాత్రం ఇప్పుడు అందరికీ హీరోలా కనిపిస్తున్నాడు. అతను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని కారుపై విచ్చలవిడిగా దాడి చేశారు. ఒక కుర్రాడు అతని కారుపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. వెనుక అద్దాన్ని పగలగొట్టారు. అప్పుడు అతని భార్య, తల్లి కారులోనే ఉన్నారు. ఆ మరుసటి రోజు అమర్ దీప్ ఆ కారుపై దాడి ఘటనపై స్పందించాడు. ఎక్కడా కూడా ఎవరినీ కించపరచకుండా ఎంతో సౌమ్యంగా చెప్పాడు. తాను ఒక్కడే ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా తాను భయపడనని.. కానీ, కుటుంబంలో ఉన్నప్పుడు అలా చేయడం బాధ కలిగించిదన్నాడు. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టడంపై అమర్ ఆనందం వ్యక్తం చేశాడు. తాను రన్నర్ అయినందుకు ఎలాంటి బాధ లేదన్నాడు. కానీ, ప్రశాంత్ తీరు మాత్రం మరోలా ఉంది. బయట పరిస్థితి బాలేదు వెనుక గేటు నుంచి వెళ్లిపోమంటే ప్రశాంత్ వినలేదు. తిరిగి మళ్లీ స్టూడియో వద్దకే వచ్చాడు.

పల్లవి ప్రశాంత్ చేసిన ఆ పని వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. పోలీసులు వద్దని వారిస్తున్నా కూడా ప్రశాంత్ మాత్రం వినలేదు. అలాగే ర్యాలీ చేశాడు. అక్కడున్న ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనానలు ధ్వంసం చేశారు. ఆఖరికి పోలీసులు వాహనాన్ని కూడా పగలగొట్టారు. ఈ విషయంపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్, అతని సోదరుడిని రిమాండుకు పంపారు. మరో 14 మందిని ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విలన్ అనుకున్న అమర్ హీరో అయ్యాడు.. హీరోగా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ మాత్రం విలన్ గా కనిపిస్తున్నాడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పల్లవి ప్రశాంత్ అరెస్టు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments