iDreamPost
android-app
ios-app

8 సినిమాల బాక్సాఫీస్ యుద్ధం

  • Published Sep 12, 2022 | 6:03 PM Updated Updated Dec 06, 2023 | 3:50 PM

ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే రాబోయే సినిమాల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే రాబోయే సినిమాల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Published Sep 12, 2022 | 6:03 PMUpdated Dec 06, 2023 | 3:50 PM
8 సినిమాల బాక్సాఫీస్ యుద్ధం

మొన్న శుక్రవారం బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితంతో గడిచిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే రాబోయే సినిమాల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ 15,16న ఏకంగా ఎనిమిది చిత్రాలు నువ్వా నేనా అని తలపడటం ఆసక్తి రేపుతోంది. మొదటిది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్ బాబు కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినీ పరిశ్రమ నేపథ్యంలో తీయడం విశేషం. ట్రైలర్ వచ్చాక యూత్ ఫ్యామిలీస్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వి డిజాస్టర్ దెబ్బకు రూటు మార్చి తిరిగి సమ్మోహనం స్కూల్లోకి వచ్చేసిన ఇంద్రగంటితో పాటు టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది.

కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అదే రోజు రానుంది. ఎస్ఆర్ కళ్యాణమండపంతో తనకో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీధర్ గాదెతో చేస్తున్న రెండో మూవీ ఇది. సమ్మతమే అంతకుముందు సెబాస్టియన్ రెండు వరసగా షాక్ ఇవ్వడంతో కిరణ్ కు ఇది హిట్ కావాల్సిన అవసరం చాలా ఉంది. మణిశర్మ సంగీతంతో పాటు మాస్ ని టార్గెట్ చేసి కమర్షియల్ గా సినిమాను తీశారు. రెజీనా నివేదా థామస్ టైటిల్ పాత్రలు పోషించిన ‘శాకినీ డాకిని’కి పబ్లిసిటీ స్పీడ్ పెంచారు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన ఈ కొరియన్ రీమేక్ మొదట్లో ఓటిటి అన్నారు కానీ ఫైనల్ గా థియేటర్లకు వస్తున్నారు. సురేష్ సంస్థ అండగా నిలవడం రిలీజ్ కు ప్లస్ కానుంది.

ఈగ విలన్, ఇటీవలే విక్రాంత్ రోనాతో పలకరించిన కిచ్చ సుదీప్ ‘కె3 కోటికొక్కడు’ మంచి ప్రమోషన్లు చేసుకుంటోంది. ఇది నెలల క్రితమే కన్నడలో వచ్చింది. ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇందులో హీరో డ్యూయల్ రోల్ కావడం విశేషం. ఇవి కాకుండా నేను నువ్వు, సకల గుణాభి రామా, ఆ అః కూడా సేమ్ డే అంటున్నాయి. ఒక రోజు ముందు 15న శింబు-గౌతమ్ మీనన్ ‘ది లైఫ్ అఫ్ ముత్తు’ పలకరిస్తుంది. స్రవంతి సంస్థ హక్కుదారు కావడంతో చెప్పుకోదగ్గ రిలీజ్ ఉంటుంది. మొత్తానికి రెండు రోజుల్లో ఎనిమిది సినిమాలు రావడం అంటే విశేషమే కానీ మరీ ఇన్నేసి ఆప్షన్లు ఉన్నా ఆడియన్స్ ఏది చూడాలో కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఏవి గెలుస్తాయో ఏవి ఓడతాయో చూడాలి

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss