iDreamPost
iDreamPost
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో, పురుషుల జావెలిన్ త్రోలో చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పతకం గెల్చిన రెండో భారతీయుడు నీరజ్ చోప్రానే. అందుకే ప్రధాని మోదీ ఇదో ప్రత్యేక క్షణమని అభివర్ణించారు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన నీరజ్ చోప్రాకు, నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్‌లో రజతం సాధించి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని గెలుచుకున్న రెండవ భారతీయునిగా, మొదటి పురుష ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా మరో చరిత్ర సృష్టించాడు. మెడల్ ఫేవరెట్‌గా ఫైనల్స్ స్టార్ట్ చేసిన చోప్రా, 88.13 మీటర్ల బెస్ట్ త్రో చేసి, రెండో స్థానంలో నిలిచాడు. దిగ్గజ లాంగ్ జంపర్ అంజు బూబీ జార్జ్ 2003 పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం( కాంస్యం) గెల్చుకున్న మొదటి భారతీయురాలు.