iDreamPost
iDreamPost
కీపాక్స్ కేసులు కలవర పెడుతున్నాయి. ఇంకా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకుండానే, కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయి. ఈలోగా మంపీకాక్స్ కేసులు. ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఏ ఒక్కదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కేసులు బయటపడుతున్నాయని WHO వెల్లడించింది. దాదాపు 20 దేశాల్లో 200 మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. ఇవికాస్తా, సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదన్నది ఒక అంచనా. కానీ.. కరోనా వైరస్ లా మంకీపాక్స్ ప్రభావం చూపించే అవకాశాలు లేవు. ఇది పెద్ద ఊటర. అలాగని తేలిగ్గా తీసుకోకూడదు. ఇదొక అంటు వ్యాధిగా అభివర్ణించిన WHO దీన్ని నియంత్రించవచ్చని తెలిపింది. టీకాల మందులు నిల్వ చేసుకొనేందుకు ఓ కేంద్రాలను రూపొందించుకోవాలని సూచించారు.
మంకీపాక్స్ తేలికపాటి వైరల్ ఇన్ఫెక్షన్. కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజిరియాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ లు, చికిత్సలు అందుబాటులో ఉన్నా, మరణాల రేటు దాదాపు 1 శాతం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 20 కంటే ఎక్కువ దేశాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఏజెన్సీ అంచనా వేస్తోంది. మంకీపాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, నియంత్రణ దిశగా చర్యలు తీసుకోవాలని WHO సూచిస్తోంది.