ఎన్ సీసీ అంటే అందరికి తెలిసిందే. స్కూల్ స్థాయిలో సమాజ సేవ, దేశ రక్షణకు సంబంధించిన కార్యక్రమలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసినది. దీని ద్వారా ఎంతో మంది పిల్లలు శిక్షణ పొంది.. సమాజంలో వివిధ సేవలు చేస్తుంటారు. అంతేకాక దీని ద్వారా ఆర్మీలోకి కూడా వెళ్తుంటారు. అందుకే ఆర్మీ స్థాయిలో ఇచ్చే శిక్షణ ఎన్ సీసీలో ఇస్తుంటారు. అయితే తాజాగా కొందరు యువకులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ట్రైనింగ్ వివాదస్పదమైంది. వర్షం పడుతున్న సమయంలో బురద నీటిలో ఎన్ సీ సీ విద్యార్థుల చేత వాళ్ల సీనియర్ పుప్-అప్ చేయించాడు. అంతేకాక వారిని కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని థానేలోని బందోద్కర్ కాలేజీలో ఎన్‌సీసీ శిక్షణలో ఇది జరిగింది. ఎనిమిది మంది యువకులను వర్షం పడుతుండగా ఒక నీటి కుంటలో పుష్ అప్ చేయించారు. పుష్ అప్ కోసం చేతులను కాకుండా తలను నేలపై పిన్ చేశారు. ఈ క్రమంలో వారిలో కొందరు విద్యార్థులు పొజిషన్ సరిగ్గా లేదని అక్కడే శిక్షణ ఇస్తున్న వ్యక్తి.. వారిని కర్రతో అత్యంత దారుణంగా కొట్టాడు. తర్వాత వాక్, వాక్, వాక్ అంటూ ఒక్కొక్కరిని కొట్టాడు. ఈ ఘటనను ఓ విద్యార్థి తరగతి గదిలో నుంచి వీడియో తీశారు. ఆ తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వీడియోలో కర్ర పట్టుకున్న విద్యార్థులను కొడుతున్న వ్యక్తి.. సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్‌గా గుర్తించారు. సవాళ్లతో కూడిన డ్రిల్‌ను నిర్వహించ లేకపోయినందుకు అతను ఎన్‌సిసి క్యాండెట్‌లను.. వెన్ను వీపుపై కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుచిత్రానాయక్ తెలిపారు. అలాంటి ఘటనలను ఎప్పటికి సహించబోమని, సీనియర్ విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ ఎన్‌సీసీ శిక్షణ జరుగుతోందని.. టీచర్ లేని సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. మానసిక రోగులే ఇలాంటివి చేయగలరని.. ఈ చర్య చూస్తే అర్థమవుతోందని ప్రిన్సిపాల్ తెలిపారు. మరి.. వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
खूप भयानक आहे हे. ज्याप्रकारे हे सीनिअर एनसीसीचे विद्यार्थी शिक्षेच्या नावाखाली अमानुष मारहाण करत आहे.हेे पाहता त्यांना कशाचीच भीती नाही. हे काय पहिल्यांदा नाही होत आहे अनेक वेळा ह्या गोष्टी घडतात.पण ट्रेनिंग च्या नावाखाली अशी मारहाण केली जाते. #NCC #thane #joshibedekarcollege pic.twitter.com/df73N23w3e
— Padmesh Pawar || पदमेश पवार (@PawarPadmesh) August 3, 2023