iDreamPost
android-app
ios-app

వీడియో: వారానికే ఎలిమినేట్ కావడానికి కారణం.. నయని చెప్పిన నిజాలు!

  • Published Oct 16, 2023 | 2:35 PM Updated Updated Oct 16, 2023 | 2:35 PM
  • Published Oct 16, 2023 | 2:35 PMUpdated Oct 16, 2023 | 2:35 PM
వీడియో: వారానికే ఎలిమినేట్ కావడానికి కారణం.. నయని చెప్పిన నిజాలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి కంటే కూడా ఇప్పుడు నయనీ పావని ఎలిమినేషన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆమెను హౌస్ నుంచి పంపేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. నయనీ పావనీని తిరిగి వెనక్కు తీసుకురావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎలిమినేట్ కావడంపై నయని ఎలా రిసీవ్ చేసుకుంది? ఎందుకు ఎలిమినేట్ అయ్యిందని భావిస్తోంది అనేది చాలా మందికి తెలియదు. కానీ, ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్, హౌస్ లో ఉన్న సభ్యుల ఆటతీరు గురించి నయని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

“నేను హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యాను అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. నాగార్జున గారు నయనీ నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని చెప్పినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోవాలి అనే విషయం కూడా నేను మర్చిపోయాను. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. హౌస్ లో అందరితో చాలా తక్కువ సమయంలో కనెక్ట్ అయ్యాను. అందరు చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా శివాజీ గారితో బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన్ను చూడగానే మా నాన్న గుర్తొచ్చారు. అన్ని టాస్కుల్లో నేను బాగా ఆడాను. నాకు జెండర్ డిఫరెన్స్ లాంటివి లేవు. అందుకే ఫిజికల్ టాస్కుల్లో కూడా అబ్బాయిలోత పోటీ పడి ఆడాను. హౌస్ లో ఉండి ఉంటే ఇంకా బాగా ఆడేదాన్ని. ఇంత త్వరగా వచ్చేస్తాను అనుకోలేదు. నేను అయితే టాప్ 5 వరకు ఉంటాను అనుకున్నాను. టైటిల్ కొట్టగలను అనే నమ్మకం కూడా ఉండేది. బయటకు వచ్చిన తర్వాత చూస్తే అందరూ మెసేజ్ లు, ఏడుస్తూ వీడియోలు పెడుతున్నారు.

అవన్నీ చూసిన తర్వాత.. ఇంత ఫాస్ట్ గా హౌస్ నుంచి వచ్చినందుకు బాధ పడాలో.. నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు అని ఆనంద పడాలో అర్థం కావడం లేదు. ఫ్యాన్స్ అందరూ నేను తిరిగి వెళ్లాలి అని కోరుకుంటున్నారు. వాళ్ల వల్లే నేను హౌస్ లోకి వెళ్లాను. మళ్లీ వాళ్లే హౌస్ లోకి పంపుతాను అంటే కచ్చితంగా వెళ్తాను. నేను ఎలిమినేట్ కావడానికి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు. బాగా ఆడుతున్నాను. నయని కచ్చితంగా సేవ్ అవుతుందిలే అని చాలా మంది ఓటు నాకు వేయలేదు అనుకుంటున్నాను. కానీ, నాకు ఫ్యాన్స్ మీద ఎలాంటి కోపం లేదు. నా ఎలిమినేషన్ కు ప్రధాన కారణం నాకు ఓట్లు పడకపోవడమే. అందుకే నేను ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చేశాను” అంటూ నయనీ పావని తన ఎలిమినేషన్ గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయింది. నయని పావని పూర్తి ఇంటర్వ్యూ ఈ కింది వీడియోలో చూడండి. నయని పావనీ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio