iDreamPost
android-app
ios-app

నయనతార-విగ్నేష్ శివన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో వైరల్.. వీడియో నిజమేనా??

  • Published Jun 08, 2022 | 8:30 PM Updated Updated Jun 08, 2022 | 8:30 PM
  • Published Jun 08, 2022 | 8:30 PMUpdated Jun 08, 2022 | 8:30 PM
నయనతార-విగ్నేష్ శివన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో వైరల్.. వీడియో నిజమేనా??

స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. గతంలోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక అప్పట్నుంచి వీరి పెళ్లిపై అనేక రకాల వార్తలు వస్తూనే వున్నాయి. వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా గుళ్ళు, గోపురాలు అంటూ తెగ తిరిగేశారు. ఇక పార్టీలు, పండగలు కలిసి చేసుకున్నారు. దీంతో వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అంతా ఆలోచించేవారు. తాజాగా వీరి పెళ్లి జూన్ 9న జరగనుందని క్లారిటీ వచ్చింది.

నయన్-విగ్నేష్ వివాహం మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జూన్ 9 ఉదయం జరగనుంది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే నయన్​-విఘ్నేష్​ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇది ఒక యానిమేటేడ్ వీడియో. ఈ వీడియోలో వధువు, వరుడు సాంప్రదాయ దుస్తులు ధరించి ఒక గుడిలోకి వెళ్తున్నట్టుగా ఉంది. అలాగే దీంట్లో నయనతార, విఘ్నేష్​, వారి తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, పెళ్లి జరిగే సమయం, పెళ్లి వేదిక.. ఇలా అన్ని డీటెయిల్స్ ని ఇచ్చారు. చూడటానికి అధికారిక ఇన్విటేషన్ లాగానే ఉంది.

కానీ నయనతార విగ్నేష్ పెళ్ళికి పిలవాల్సిన వాళ్లకి స్వయంగా వెళ్లి కార్డ్స్ ఇచ్చారని, ఇలాంటి వీడియో ఏది చేయలేదని సమాచారం. ఈ వీడియో ఫ్యాన్స్ చేసి ఉంటారని అంటున్నారు. అది నిజమో కాదో కానీ వీడియో మాత్రం చాలా బాగుంది. అందులో డీటెయిల్స్ కూడా కరెక్ట్ కదా అని సోషల్ మీడియాలో నయన్ -విగ్నేష్ పెళ్లి ఇన్విటేషన్ అంటూ షేర్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio