iDreamPost
android-app
ios-app

ప్రియుడితో పెళ్ళికి సిద్దమైన లేడీ సూపర్ స్టార్.. ముహూర్తం ఖరారు..

  • Published May 07, 2022 | 10:53 AM Updated Updated May 07, 2022 | 10:53 AM
ప్రియుడితో పెళ్ళికి సిద్దమైన లేడీ సూపర్ స్టార్.. ముహూర్తం ఖరారు..

మనసినక్కరే అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నయనతార లక్ష్మి సినిమాతో తెలుగులో పరిచయమైంది. తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకపక్క కమర్షియల్ సినిమాలతో పాటు మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయన్. నయన్ గతంలో శింబుని, ప్రభుదేవాని ప్రేమించినట్టు వార్తలు వచ్చాయి. కాని గత కొద్ది రోజులుగా నయనతార తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

నేను రౌడీనే అనే సినిమాతో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో నయన్ హీరోయిన్ గా చేయగా విగ్నేష్ శివన్ డైరెక్షన్ చేశాడు. అప్పుడు పరిచయంగా మొదలైన వీరు ప్రస్తుతం ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. టెంపుల్స్ కి , టూర్స్ కి వెళ్తున్నారు. పార్టీలు, పండగలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కలిసి ఉంటున్నారు కూడా. ఇద్దరూ కలిసి నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు.

వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. నయన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వారిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని కూడా తెలిపింది. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో మాత్రం చెప్పకుండానే దేశంలోని అన్ని గుళ్ళకి తిరిగేస్తున్నారు. తాజాగా వారి పెళ్లి అధికారికంగా ఫిక్స్ అయినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట జూన్ 9న తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇవాళ(మే 7న) ఉదయం నయనతార, విగ్నేష్ శివన్ తిరుమలకి వచ్చి దర్శనం చేసుకొని వారి పెళ్లి ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. మొత్తానికి ఇన్నాళ్ల నుంచి వేచి చుసిన ఈ జంట జూన్ 9న శ్రీవారి సన్నాధిలో ఒక్కటి కాబోతుంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş