iDreamPost
android-app
ios-app

గంగానది ఒడ్డున కాంగ్రెస్ నేత సిద్ధూ కుమారుడి నిశ్చితార్థం!

గంగానది ఒడ్డున కాంగ్రెస్ నేత సిద్ధూ కుమారుడి నిశ్చితార్థం!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. సిద్ధు కుమారుడు కరణ్‌ సిద్ధూ త్వరలో వివాహం జరగనుంది. కరణ్ సిద్ధూకు పాటియాలాకు చెందిన ఇనాయత్‌ రంథావాను వివాహం చేసుకోనున్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం వెరైటీగా చేశారు.  గంగానది ఒడ్డున కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వారి నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సిద్ధూ సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ కాబోయే కోడలిని పరిచయం చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

తన కుమారుడు తన తల్లి కోరికను నెరవేర్చాడని, పవిత్ర దుర్గా, అష్టమి వ్రత తిథినాడు గంగానది ఒడిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడని ఆయన అన్నారు. తనకు కాబోయే కోడలు ఇనాయత్‌ రంధావాతో  కరణ్ సిద్దూ ఉంగరాలు మార్చుకున్నారంటూ సిద్ధూ  ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫిక్స్ ను షేర్‌ చేశారు. ఈ ఫోటోలు సిద్ధూ, ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ, కుమార్తె రబియా సిద్ధూ కూడా ఉన్నారు. పాటియాలాకు చెందిన మనీందర్‌ రంధావా ఆర్మీలో పని చేశారు. ఆయన  కుమార్తెనే ఇనాయత్‌. ప్రస్తుతం పంజాబ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా మనీందర్ పనిచేస్తున్నారు.

ఇక సిద్ధు విషయానికి వస్తే.. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ గొడవకు సంబంధించిన కేసులో గతేడాది దోషిగా తేలి ఆయన జైలుకెళ్లిన విషయం తెలిసిందే. 10 నెలల జైలు శిక్షను ముగించుకుని 2023 ఏప్రిల్‌లోనే పాటియాలా సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి సిద్ధు.. తన కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. గత నెల తన కుటుంబంతో కలిసి సిద్ధు.. రిషికేశ్‌ను సందర్శించారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న సిద్ధు కుమారుడి నిశ్చితార్థ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom