iDreamPost
android-app
ios-app

వీడియో: మల్లారెడ్డి స్టైల్లో డైలాగ్‌ అదరగొట్టిన నవీన్‌ పోలిశెట్టి!

  • Published Jul 12, 2023 | 8:28 AM Updated Updated Jul 12, 2023 | 8:28 AM
  • Published Jul 12, 2023 | 8:28 AMUpdated Jul 12, 2023 | 8:28 AM
వీడియో: మల్లారెడ్డి స్టైల్లో డైలాగ్‌ అదరగొట్టిన నవీన్‌ పోలిశెట్టి!

జాతి రత్నాలు సినిమాతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్నారు నవీన్‌ పోలిశెట్టి. ఈ సినిమాలో ఆయన నటనకు ఫిదా అయి.. చాలా మంది నవీన్‌కు ఫ్యాన్స్‌గా కూడా మారిపోయారు. ఇక, ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాతి రత్నాల తర్వాత నవీన్‌ నటించిన ఏ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. జాతి రత్నాలు విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత ఆయన ‘‘ మిస్‌ శెట్టి, మిస్టర్‌ పోలిశెట్టి’’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలోనే నవీన్‌ పోలిశెట్టి సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన తాజాగా, కాలేజ్‌ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా స్టేజిమీద రచ్చ రచ్చ చేశారు. మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్‌ చేస్తూ తన గురించి చెప్పుకొచ్చారు. స్టేజి మీద నవీన్‌ పోలిశెట్టి మాట్లాడుతూ.. ‘‘  ఇన్ని హిట్లు ఏడి కెళ్లి వచ్చినయ్‌.. ఎట్లొచ్చినయ్‌..నేనమ్మన్న మాయ చేసిననా.. నేనమన్న మంత్రం చేసిననా.. కష్టపడ్డా.. స్క్రిప్టు రాసిన.. యూట్యూబ్‌లో వీడియోలు చేసినా.. అనుష్కతో హీరోగా చేసిన.. సక్సెస్‌ అయిన..

ఆగస్టు 4 నాడు కాలేజీలకు బంక్‌ కొట్టుర్రి. ఏమున్నది ఆగస్టు 4 నాడు’’ అంటూ మల్లారెడ్డిని అచ్చం దించేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, నవీన్‌ పోలిశెట్టి.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019లో వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో మంచి హిట్‌ అందుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ అనగనగా ఒక రాజు సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. మరి, నవీన్‌..మల్లారెడ్డిని ఇమిటేట్‌ చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio