iDreamPost
android-app
ios-app

Nani : న్యాచురల్ స్టార్ స్పీడ్ తగ్గేలా లేదు

  • Published Jan 24, 2022 | 5:00 AM Updated Updated Jan 24, 2022 | 5:00 AM
Nani : న్యాచురల్ స్టార్ స్పీడ్ తగ్గేలా లేదు

కరోనా లాక్ డౌన్ ల వల్ల సినిమా రిలీజులు షూటింగులు ఎంతగా ప్రభావితం చెందుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు అగ్ర హీరోలందరూ తమ షూట్లకు బ్రేక్ ఇచ్చేశారు. ఒకరిద్దరు ధైర్యంగా చేస్తున్నారు కానీ యూనిట్ లో ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా చాలు మొత్తం ఆగిపోతుంది. థియేటర్లకు జనం వస్తున్నా సరే నిర్మాతలు కొత్త విడుదల తేదీలను ప్రకటించలేకపోతున్నారు. ఈ విషయంలో న్యాచురల్ స్టార్ నానిని మెచ్చుకోవచ్చు. చిత్రీకరణను అనుకున్న టైంలో పూర్తి చేసేందుకు పక్కా ప్లానింగ్ తో సాగుతున్న తీరు నిర్మాతలకు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతోంది. నిన్నే అంటే సుందరానికి గుమ్మడికాయ కొట్టేశారు.

మైత్రి లాంటి పెద్ద బ్యానర్ లో రూపొందినప్పటికీ దర్శకుడు వివేక్ ఆత్రేయ దీన్ని రీజనబుల్ బడ్జెట్ లోనే రూపొందించారు. నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మంచి ఎంటర్ టైనింగ్ ట్విస్టు ఉంటుందట. అదేంటో ముందే చెప్పేస్తే థ్రిల్ ఉండదు కాబట్టి టీమ్ అది లీక్ కాకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పుడీ అంటే సుందరానికి పూర్తవ్వడంతో నాని వెంటనే దసరాకు రెడీ అవుతాడు. దీనికి కొంచెం బారుడు గెడ్డం జుట్టు అవసరం ఉండటంతో ఒక నెలకు పైగా గ్యాప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయట. నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ అయినప్పటికీ డిఫరెంట్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నానిని ప్రెజెంట్ చేయబోతున్నట్టు సమాచారం.

గత రెండేళ్లు వి, టక్ జగదీష్ లు డైరెక్ట్ ఓటిటికి వెళ్లే విషయంలో విమర్శలు అందుకున్న నాని వాటిని పట్టించుకోలేదు. పలు సందర్భాల్లో హర్ట్ అయినట్టు కనిపించినా ఇతరులు అదే పని చేస్తే తప్పు కానిది నానికి మాత్రమే ఎందుకు ఆపాదిస్తున్నారనే మద్దతు సినిమా అభిమానుల్లో దొరికింది. అందుకే ఫోకస్ మొత్తం శ్యామ్ సింగ రాయ్ మీద పెట్టేసి మంచి ఫలితాన్ని అందుకున్నాడు. బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ ఊహించిన దాని కన్నా మంచి సక్సెస్ అందుకున్న మాట వాస్తవం. అంటే సుందరానికి, దసరా తర్వాత నాని చేయబోయే సినిమాల తాలూకు అఫీషియల్ అనౌన్స్ మెంట్లు ఇంకా రావాల్సి ఉంది.

Also Read : Pelli SandaD : వంద రోజులు దాటినా డిజిటల్ రాలేదే

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş