iDreamPost
android-app
ios-app

Balakrishna : బాలయ్య ఇష్టంగా తినే ఫుడ్ సీక్రెట్స్ మీకోసం!

  • Published Jan 19, 2022 | 11:53 AM Updated Updated Jan 19, 2022 | 11:53 AM
Balakrishna : బాలయ్య ఇష్టంగా తినే ఫుడ్ సీక్రెట్స్ మీకోసం!

1980ల నుంచి తెలుగు చిత్రసీమలో తిరుగులేని మాస్ హీరోగా వెలుగొందుతున్నారు నందమూరి బాలకృష్ణ .తెలుగు సినీ చరిత్రలో మరువలేని ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించారు బాలయ్య. హీరోలందరిలో బాలయ్య రూటే సెపరేటు. టాలీవుడ్ పరిశ్రమలో బాలయ్య ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఆయనకి సినిమా వల్ల అభిమానులే కాదు ఆయన వ్యక్తిత్వం నచ్చి అభిమానులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆయన చేసే పలు సేవ కార్యక్రమాలలో కూడా ఆయనకి ఆయనే సాటి.

ఇక విషయానికి వస్తే, ఇప్పుడు బాలయ్య మొదటిసారిగా ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోను హోస్ట్ చేస్తున్నాడు, ఇది ఆ OTT లోనే మంచి పేరు తెచ్చిపెట్టింది మరియు భారీ సక్సెస్ ని బాలయ్య ఖాతాలో వేసింది ఈ షో. ఈ కార్యక్రమం బాలకృష్ణ యొక్క రియల్ లైఫ్ ఇమేజ్‌కి కూడా చాలా మేలు చేసింది, ఎందుకంటే చాలా మందికి ఆయన నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలియదు మరియు అతని ఆఫ్-స్క్రీన్ వ్యక్తిత్వం పైన అనేక కథలు ఉన్నాయి.

‘అన్‌స్టాపబుల్’ షో మేకర్స్ ఇప్పుడు బాలయ్య తన డిన్నర్‌కి ఫుడ్ ఆర్డర్ చేస్తున్న వీడియోను విడుదల చేసారు. ఫోన్ సంభాషణలో, బాలయ్య తన వంట వ్యక్తిని ముందుగా బంగాళాదుంప కర్రీని సిద్ధం చేయమని అడిగారు, ఆ తర్వాత కాలీఫ్లవర్ కర్రీ, దొండకాయ ఫ్రై మరియు తరువాత వాము రసంతో పాటు వాటిలో కావలసిన పదార్థాల సంఖ్య & దాని పరిమాణంతో సిద్ధం చేయమని చెప్పారు.

కొబ్బరి చట్నీతో ఉతప్పం మరియు బొంబాయి రవ్వతో జీడిపప్పు ఉప్మా సిద్ధం చేయమని చెప్పి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ మెనూ కూడా ఇచ్చారు. చివరకు బంగాళదుంప కూరను రద్దు చేసి, ఇతర వంటకాలను సిద్ధం చేయమని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘అఖండ’ ఘనవిజయం తర్వాత బాలయ్య ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş