iDreamPost
android-app
ios-app

నాగ‌శౌర్య‌ది Bad Taste

నాగ‌శౌర్య‌ది Bad Taste

త‌మిళంలో డైరెక్ట‌ర్ బాల‌కి పిచ్చి. సినిమాను చాలా అద్భుతంగా తీస్తాడు కానీ, ఎక్క‌డో ఒక‌చోట జుగుప్సాక‌రంగా తీస్తాడు. అవ‌న్ ఇవ‌న్‌లో ఒక ముస‌లాన్ని బ‌ట్ట‌లు లేకుండా చెట్టుకు వేలాడ‌దీస్తాడు. తారాటా త‌ప్పాటాలో ఆఖ‌రి సీన్‌ని భ‌రించ‌లేం. తెలుగులో డ‌బ్ అయిన నేనే దేవుడైతే మ‌రీ భ‌యంక‌రం. హీరో ఆర్య అఘోరా నుంచి వ‌చ్చిన వాడు.

బాల చాలా క్లాసిక్‌గా తీస్తాడు కాబ‌ట్టి కొంచెం భ‌రించ‌వ‌చ్చు. మ‌న హీరో నాగ‌శౌర్య సొంతంగా క‌థ రాసుకున్న అశ్వ‌థ్థామ‌లో విల‌న్ క‌థ మ‌రీ Bad Taste. అత‌ని ఇంట్రో సీన్‌లో శ‌వంతో సెక్స్ చేస్తాడు. ఇంత జుగుప్స అవ‌స‌ర‌మా? సెక్స్ ప‌ర్వ‌ర్టెడ్ మీద క‌థ రాసుకోవాల‌నుకున్న‌ప్పుడు మాన‌సిక శాస్త్రానికి సంబంధించిన చాలా విష‌యాలు తెలుసుకోవాలి. ఆ Home Work ఏమీ లేకుండా ఏదో థ‌ర్డ్‌గ్రేడ్ ఇంగ్లీష్ సినిమా చూసి Inspire అయితే ఇలాంటి సినిమాలే వ‌స్తాయి.

హిచ్‌కాక్ త‌న సినిమాల్లో నేర స్వ‌భావం ఉన్న వాళ్ల‌కి బ‌ల‌మైన నేప‌థ్యాన్ని త‌యారు చేస్తాడు. సైకోలో విల‌న్ ప్ర‌తి క‌ద‌లిక‌లో మాన‌సిక రోగి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తూ ఉంటాయి. సినిమాని రెండోసారి చూసిన‌ప్పుడు ద‌ర్శ‌కుడు తీసుకున్న జాగ్ర‌త్త‌లు క‌నిపిస్తాయి.

కానీ అశ్వ‌థ్థామ‌లో ఒక 16 ఏళ్ల కుర్రాడు సొంత థియ‌రీ త‌యారు చేసుకుంటాడు. “నేరం చేయ‌డం త‌ప్పు కాదు, సాక్ష్యాన్ని మిగల్చ‌డం త‌ప్పు” అని దాంతో హ‌త్య‌లు చేస్తూ , ఆ శ‌వాల‌ను భ‌ద్ర‌ప‌రుస్తూ కూడా ఉంటాడు. ఇన్ని నేరాల‌కు సాయం చేసేది ఎవ‌రంటే ఒక ముస‌లివాడు.

లోకంలో శ‌వాల‌ను తినేవాళ్లు కూడా ఉంటారు. అయితే వాళ్లు క‌థా వ‌స్తువు చేయ‌డం వ‌ల్ల Art పుట్ట‌దు. ఎర్ర‌గులాబీలు సినిమాలో భార‌తీరాజా ఒక మాన‌సిక రోగి గురించి ఎంత అద్భుతంగా చెప్పాడో ఒక ఉదాహ‌ర‌ణ‌గా ఉంది.

చాలా ఈజ్ , ప్ర‌తిభ ఉన్న నాగ‌శౌర్య ఇలాంటి గ‌లీజ్ క‌థ‌లు రాయ‌క‌పోతేనే ఆయ‌న‌కీ, సొసైటీకి ఆరోగ్య‌క‌రం.
Smoking మాత్ర‌మే Injurious కాదు.
ఇలాంటి Thoughts కూడా.