iDreamPost
android-app
ios-app

భర్త, మామాని ఫేస్ బుక్ లైవ్ లో పెట్టి మరీ భార్య సూసైడ్!

  • Author Soma Sekhar Published - 03:57 PM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 03:57 PM, Fri - 23 June 23
భర్త, మామాని ఫేస్ బుక్ లైవ్ లో పెట్టి మరీ భార్య సూసైడ్!

సమాజంలో మహిళలపై రోజురోజుకు ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా గానీ.. స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు ఆగడంలేదు. దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతి రోజు మహిళలు హింసలకు గురౌతూనే ఉన్నారు. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక కొంత మంది మహిళలు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నాచారంలో దారుణం చోటుచేసుకుంది. భర్త, అతడి కుటుంబం టార్చర్ భరించలేక ఓ వివాహిత ఫేస్ బుక్ లైవ్ లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ పుత్-సనా దంపతులు. వీరికి మూడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. రాజస్థాన్ కు చెందిన రాజ్ పుత్ ని 2019లో సనా ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి సనా తండ్రికి ఇష్టం లేదు. కానీ రాజ్ పుత్ మతం మారుతాడని సనా తన తండ్రిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి రాజ్ పుత్ కుటుంబ సభ్యులకు సైతం ఇష్టం లేదు. దాంతో ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చారు అతడి కుటుంబ సభ్యులు.  అత్తింటి వేధింపులు తట్టకోలేక.. తండ్రి ఉంటున్న బిల్డింగ్ లోనే సనా కూడా వేరుగా నివాసం ఉంటోంది.

ఈ క్రమంలోనే సనా తల్లి తన కూతురి ఇంటికి వెళ్లి ఎంత తలుపు కొట్టినా తీయకపోవడంతో.. స్థానికుల సహాయంతో తలుపును బద్దలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. సనా ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఇక ఆమె ఉరి వేసుకునే క్రమంలో ఫేస్ బుక్ లో.. భర్త, మామని లైవ్ లో పెట్టి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ఇక తన కూతురిని మానసికంగా వేధించడం వల్లే చనిపోయిందని, దానికి కారణం ఆమె భర్త, మామలే అని సనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అల్లుడు రాజ్ పుత్ కు సూఫీ ఖాన్ అనే మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని, దాంతో తరచుగా నా కూతురిని ఇబ్బందులకు గురిచేసేవాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాగా.. సూఫీఖాన్ వల్ల గొడవలు వస్తున్నాయని గతంలోనే సనా తండ్రి నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఇరు కుటుంబాలు మాట్లాడుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. కానీ సూఫీఖాన్ విషయంలో అతడి తీరు మారకపోవడంతో తన కూతురు వచ్చేసిందని సనా తండ్రి చెప్పుకొచ్చాడు. సూఫీ ఖాన్, రాజ్ పుత్ కు మధ్య జరిగిన సంభాషణలు, చాటింగ్ లు, వాళ్లు దిగిన ఫోటోలు వారి అక్రమ సంబంధానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని సనా తండ్రి అంటున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ