iDreamPost
android-app
ios-app

Jr NTR & AR Rahman : యంగ్ టైగర్ ప్రాజెక్టుకు లెజెండరీ మ్యూజిక్

  • Published Feb 01, 2022 | 7:45 AM Updated Updated Feb 01, 2022 | 7:45 AM
  • Published Feb 01, 2022 | 7:45 AMUpdated Feb 01, 2022 | 7:45 AM
Jr NTR & AR Rahman : యంగ్ టైగర్ ప్రాజెక్టుకు లెజెండరీ మ్యూజిక్

ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లకు పైగా త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇకపై చేయబోయే సినిమాల వేగం పెంచబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కూడా స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశాడట. రెండింటి మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండేలా తారక్ వీటిని ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఒకేసారి చిత్రీకరణ జరుపుతారా లేక ఒకటయ్యాక మరొకటా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ముందు వీటిని పూర్తి చేస్తే దానికి ఎక్కువ టైం ఇవ్వొచ్చు.

తాజా అప్ డేట్ మేరకు బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం ఇస్తారని టాక్. అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని అంటున్నారు. ఇది ఒకరకంగా గుడ్ న్యూస్ అయితే మరో కోణంలో ఫాన్స్ ని టెన్షన్ పెట్టే వార్త. ఎందుకంటే రెహమాన్ చాలా ఏళ్ళ నుంచి ఫామ్ లో లేరు. తన స్థాయికి తగ్గ ఆల్బమ్ ఎప్పుడు ఇచ్చారంటే వెంటనే బదులు చెప్పడం కష్టం. పైగా తెలుగులో ఆయన చేసిన స్ట్రెయిట్ సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్లే. సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ తో మొదలుపెడితే మొన్నామధ్య వచ్చిన కొమరం పులి దాకా మాములు ఉదాహరణలు లేవు. పల్నాటి పౌరుషం ఆడింది కానీ మరీ గొప్పగా అయితే కాదు.

ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించినా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వగలరా అనేదే అభిమానుల ఆందోళన. టాలీవుడ్ లో ఎన్ని ఆఫర్లు వచ్చినా చాలా కాలం నుంచి నో చెప్పుకుంటూ వచ్చిన రెహమాన్ ఆ మధ్య సైరా నరసింహారెడ్డి ప్రతిపాదన కూడా తిరస్కరించారు. మరి జూనియర్ కోసం ఓకే చెప్పారా లేదా అనేది వేచి చూడాలి. ఉప్పెన వచ్చి ఏడాది అవుతున్నా తారక్ కోసమే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న బుచ్చిబాబు దీని దెబ్బకు గురువు సుకుమార్ లాగా స్టార్ హీరోలతో సెటిలైపోవాలని ఎదురు చూస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఈ మధ్య బోర్ కొట్టిస్తున్న తరుణంలో ఇతను ఏ మేజిక్ చేస్తాడో చూడాలి మరి

Also Read : SS Rajamouli : జక్కన్న చూపిస్తున్న కొత్త ట్రెండ్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom