iDreamPost
android-app
ios-app

ప్రముఖ ర్యాపర్‌తో ప్రేమలో మృణాల్‌ ఠాకూర్‌!

టాలీవుడ్‌ సీత మృణాల్‌ ఠాకూర్‌ బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ర్యాపర్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది...

టాలీవుడ్‌ సీత మృణాల్‌ ఠాకూర్‌ బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ర్యాపర్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది...

ప్రముఖ ర్యాపర్‌తో ప్రేమలో మృణాల్‌ ఠాకూర్‌!

సీరియల్స్‌ టు సినిమాల్లోకి వచ్చి సక్సెస్‌ సాధించటం అన్నది మామూలు విషయం కాదు. సీరియళ్లనుంచి సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుకోవటం ఎంత కష్టమో.. స్టార్‌ అవ్వటమూ అంత కంటే కష్టతరం. ఈ కష్టాలను దాటుకుని.. తన సత్తా చాటారు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌. బాలీవుడ్‌ సీరియళ్లతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మృణాల్‌ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కూడా తన సత్తా చాటుతున్నారు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన కలిసి నటించారు.

సీతారామం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. సీతారామం బాక్సాఫీస్‌ వద్ద సాధించిన ఘన విజయం మృణాల్‌ రేంజ్‌ను ఓ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆ సినిమాలో ఆమె నటనకు యూత్‌ ఫిదా అయ్యారు. తెలుగు ప్రేక్షకుల మదిలో మృణాల్‌గా కంటే.. సీతగానే చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. సీతారామం హిట్‌ తర్వాత తెలుగులో మృణాల్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవర కొండలో  ‘ ఫ్యామిలీ మ్యాన్‌’..న్యాచురల్‌ స్టార్‌ నానీతో ‘ హాయ్‌ నాన్న’ సినిమాల్లో కలిసి నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. గత కొద్ది నెలలనుంచి మృణాల్‌ పెళ్లి టాపిక్‌ మీడియాతో పాటు సోషల్‌  మీడియాలోనూ ఓ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె బాలీవుడ్‌కు చెందిన ర్యాపర్‌ బాద్‌షాతో డేటింగ్‌లో కూడా ఉందన్న వార్తలు నడుస్తూ ఉన్నాయి. తాజాగా, వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఈ వార్తలకు ఊతం ఇచ్చేదిలా ఉంది.

దీపావళి సందర్భంగా మృణాల్‌, బాద్‌షాలు ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో ఈవెంట్‌నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ పార్టీలో శిల్పాశెట్టి, బాద్‌షాలతో కలిసి దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టారు. ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు అని పేర్కొన్నారు. ఇలా ఆమె బాద్‌షాతో కలిసి తిరుగుతూ మీడియా కంటపడటం.. అతడికి సంబంధించిన పోస్టులను తరచుగా పెడుతుండటంతో డేటింగ్‌ వార్తలు ఊపందుకుంటున్నాయి.

కాగా, మృణాల్‌ ఓ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోవాలని స్టార్‌ ప్రొడ్యూసర్‌ ‘ అల్లు అరవింద్‌’ ఓ అవార్డుల ఫంక్షన్‌లో అన్నారు. ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. లావణ్య త్రిపాఠిలానే మృణాల్‌ కూడా ఓ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకోబోతోందన్న ‍ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై మృణాల్‌ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదన్నారు. ఓ మంచి అబ్బాయి ఉంటే చూసిపెట్టండని, పెళ్లి చేసుకుంటానని ఆమె ఫన్నీగా స్పందించారు. మరి, మృణాల్‌ ఠాకూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ ర్యాపర్‌ బాద్‌షాతో డేటింగ్‌లో ఉందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet