iDreamPost
iDreamPost
ఒక హీరో తన సినిమా ఫ్లాప్ అయితే పేరు మార్చుకుంటా, మూసుకున్న థియేటర్లన్నీ తెరిపించకపోతే బస్తీ మే సవాల్ అంటాడు. మరొక హీరో మా సినిమాకు వచ్చేటప్పుడు ఆరు మాస్కులు తెచ్చుకోండి, నవ్వి నవ్వి అవన్నీ ఎగిరిపోతాయని చెబుతాడు. పైగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్లకు కన్నీళ్లతో అవి తడిచిపోతాయని అందుకే అవన్నీ అంటాడు. ఇవన్నీ అతిశయోక్తులే. ఏదైనా సరే బాక్సాఫీస్ దగ్గర సినిమా మాట్లాడాలి. అంతే తప్ప విడుదలకు ముందే అవసరానికి మించిన ప్రగల్భాలకు పొతే సోషల్ మీడియాలో అనవసరమైన ట్రోలింగ్ కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. టెక్నాలజీ పుణ్యమాని వెటకారం కూడా సెకండ్లలో వైరల్ అవుతోంది.
ఈ ప్రస్తావన విశ్వక్ సేన్, శ్రీవిష్ణుల గురించే. అంత గొప్పలు చెప్పుకున్న పాగల్ ఫైనల్ గా ఫ్లాప్ వైపే వెళ్తోంది. మొన్న సోమవారం నుంచే కలెక్షన్లలో చాలా డ్రాప్ ఉంది. థియేటర్ల సిబ్బందిని బ్రతికించండని జాలి మాటలు చెబితే సరిపోదు. మనం మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులే వద్దన్నా కనక వర్షం కురిపిస్తారు. పర్వాలేదన్న ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని మూడు రోజులు నెత్తినబెట్టుకోవడం మర్చిపోతే ఎలా. ఇక శ్రీవిష్ణు మాటల్లో ఏ మేరకు నిజం ఉందో రేపు తెలిసిపోతుంది. జబర్దస్త్ జమానాలో మాములు జోకులుకు జనాలు నవ్వడం లేదు. హిలేరియస్ అనే పదానికి ఇప్పుడు డెప్త్ బాగా పెరిగిపోయింది.
నిజంగా రేపు రాజరాజ చోర ఆ స్థాయిలో ఉంటే ఆడియన్సే అనుమానం లేకుండా పబ్లిక్ టాక్ తో దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. ఏదైనా తేడా వచ్చిందో శ్రీవిష్ణు టార్గెట్ మెటీరియల్ అవుతాడు. ఇలా చేయడం వల్ల యూత్ హీరోలు చెప్పేవన్నీ డొల్ల మాటలే అనే అభిప్రాయం పబ్లిక్ లో కలిగే అవకాశం ఉంది. సినిమా గురించి చెప్పుకోవాలి. తప్పేం లేదు. ధైర్యంగా పబ్లిసిటీ చేసుకోవాలి. అదీ రైటే. కానీ అతిశయోక్తులతో కూడిన ప్రసంగాల వల్లే లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ వీడియోలను ఇక్కడితో వదిలేయరు. సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటారు. మరి యూత్ హీరోలు ఇకనైనా అలెర్ట్ గా ఉండటం బెటర్
Also Read : ఇండియన్ సినిమాలో ఎన్నడూ జరగనిది