మంకీపాక్స్ కలవరం.. 27 దేశాలకు పాకిన వైరస్, 66 మంది మృతి

కరోనా వైరస్ నుంచి ఉపశమనం లభిస్తుంది అనుకుంటున్న సమయంలో.. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం మొదలైంది. ఇప్పటి వరకూ 27 దేశాలకు మంకీపాక్స్ విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) వెల్లడించింది. 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మే 13 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 257 మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా.. ఈ సంఖ్య జూన్ 2వ తేదీకి 780కి పెరిగిందని తెలిపింది.

జూన్ 2న యూకే లో 225, అమెరికాలో 21, పోర్చుగల్ లో 143, స్పెయిన్ లో 13 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మంకీపాక్స్ కారణంగా ఈ ఏడాది 7 దేశాల్లో 66 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కాగా.. భారత్ లోనూ మంకీపాక్స్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఉత్తప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇటీవల ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించగా.. వైద్యులు అప్రమత్తమయ్యారు. బాలిక నుంచి శాంపిల్స్ ను సేకరించి పూణే ల్యాబ్ కు పంపారు. బాలిక శరీరంపై దద్దర్లు, దురద ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

Show comments