iDreamPost
ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న మంకీపాక్స్ వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ విస్తరణను పర్యవేక్షించడమే గాక, కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై, ఈ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.
ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న మంకీపాక్స్ వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ విస్తరణను పర్యవేక్షించడమే గాక, కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై, ఈ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.
iDreamPost
మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న మంకీపాక్స్ వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ విస్తరణను పర్యవేక్షించడమే గాక, కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై, ఈ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ పై కేంద్రానికి యాక్షన్ ప్లాన్ ను సిద్ధంచేయనుంది.
యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం చనిపోయాడు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మంకీపాక్స్ కేసులు నాలుగే. ఒకరు కోలుకున్నారుకూడా. కాని ఈ వ్యాధి విస్తరించకుండా అడ్డుకట్టవేయాలని కేంద్రం భావిస్తోంది. కరోనా భయానక అనుభవం ప్రభుత్వానికి తెలుసు.
అందుకే జులై 26న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ మీటింగ్ లోనే నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ను ఎర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 ఐసీఎంఆర్ ల్యాబ్స్ లో మంకీపాక్స్ పరీక్షలకు సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్ భయపెడుతోంది. 75 దేశాలకు విస్తరించిన ఈ వ్యాధిని మహమ్మారి రూపందాల్చకపోయినా, 16వేల మందికి సోకింది. లక్షణాలు, వ్యాప్తి చెందే వేగాన్ని బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అత్యవసర చర్యలు తీసుకొంటోంది. ఇప్పటిదాకా ఇండియా మంకీపాక్స్ ను కట్టడికోసం గట్టి చర్యలే చేపడుతోంది.