మోడీజీ …చంద్రబాబులాంటి సీనియర్ను మరిచారా ….!!!

అంటే ..ఆయన ఫోన్ చేద్దామనే అనుకున్నారట సర్ .కానీ మీరు బిజీగా ఉన్నరేమో అని చేయలేదనుకుంటా ..అని చెప్తున్న పీఏ వంక అదోలా చూస్తూ కూర్చున్నారు చంద్రబాబు నాయుడు. దేశంలోనే సీనియర్ను, ప్రధాని మంత్రులు,రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులను ఇంటర్వ్యూలు నిర్వహించి మరీ ఏపాయింట్మెంట్లు వేయించినవాడిని నన్నే ఆ జూనియర్ మోడీ విస్మరిస్తాడా అని లోలోన రగిలిపోతున్నారు చంద్రబాబు…..

అవును ప్రస్తుతం ఆయన పరిస్థితి అలాగే ఉంది..మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు బాధగా ఉంది అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. దేశంలో కరోనా వైరస్ ప్రబలడం, దాని నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డవున్ ప్రకటించడం, రానురాను కేసులు పెరుగుతుండడం తెలిసిందే. అయితే ఈ పరిణామాల గురించి ప్రధాని మోడీ దేశంలోని పలువురు నాయకులకు ఫోన్లు చేసి పరిస్థితిని వివరించారు. మోడి ఫోన్లు చేసినవారిలో సోనియా గాంధీ,మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్,సీనియర్ నాయకులు ములాయం సింగ్ ,మమతా బెనర్జీ, ప్రకాష్ సింగ్ బాదల్, కేసీఆర్ , జగన్ మోహ రెడ్డ్ తదితరులు ఉన్నారు.

అయితే ఈ తరుణంలో చంద్రబాబుకు ఫోన్ చేసి వివరిస్తే బాబును గుర్తించినట్లు అయ్యేది. కానీ మోడీ బాబుకు ఫోన్ చెయ్యలేదు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత మోడీని అనరాని మాటలన్నారు. ఆయన తనకన్నా రాజకీయాల్లో జూనియర్ అని, తనకు భార్యాబిడ్డలు ఉన్నారని కానీ మోడీ కి భార్య లేదని,పెళ్లయిన వెంటనే ఆమెను వదిలేశారని, ఇలా రకరకాలుగా కామెంట్లు చేశారు. పైగా మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటనకు వచ్చినపుడు మోడీ గో బ్యాక్ అంటూ హోర్డింగులు పెట్టడమే కాకుండా నల్ల బెలూన్లు ఎగరేసి అవమానించారు.

మొన్నటి జనరల్ ఎన్నికల్లో కూడా దేశంలోని పలు రాజకీయనాయకులను ఏకం చేసి మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు గ్రూపు కట్టారు. గతంలో చంద్రబాబు ఎవరితో కలిసి గ్రూపు కట్టాలని ప్లాన్ చేసారో నేడు మోడీ వాళ్లందరికీ ఫోన్లు చేశారు.బాబును మాత్రం వదిలేసారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మళ్ళీ మోడీ ప్రాపకం కోసం ఎంతగా ట్రై చేసినా అది కుదరలేదు. మళ్ళీ బాబును దరిచేర్చుకునేందుకు మోడీ ససేమిరా అంటున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 8న పార్లమెంట్ లో ఐదుగురు సభ్యులున్న ప్రతి పార్టీ ఫ్లోర్ లీడర్ లు అందరితోనూ మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ క్రమంలో మోడీ టీడీపీ ఫ్లోర్ లీడర్ అయిన గల్లా జయదేవ్ తో మాట్లాడనున్నారు. పోనీ ఈ సారైనా ఫ్లోర్ లీడర్లకు బదులుగా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడితే బాగుణ్ణు, తనకు మోడీతో మాట్లాడే ఛాన్స్ వచ్చేది కదా అని బాబు ఫీలవుతున్నారని తెలిసింది.

Show comments